![]() |
![]() |

ఉత్తరాది సోయగం రాశీ ఖన్నా.. టీవీ సీరియల్ యాక్ట్రస్ అవతారమెత్తుతోందా? అవునన్నదే ఫిల్మ్ నగర్ ఇన్ఫర్మేషన్. అయితే.. నిజంగానే టీవీ సీరియల్ లో రాశి నటిస్తోందనుకునేరు. ఆమె కొత్త అవతారం.. కేవలం ఓ కొత్త సినిమా కోసమట.
ఆ వివరాల్లోకి వెళితే.. యాక్షన్ హీరో గోపీచంద్ కథానాయకుడిగా సక్సెస్‌ఫుల్ డైరెక్టర్ మారుతి 'పక్కా కమర్షియల్' పేరుతో ఓ హిలేరియస్ ఎంటర్‌టైనర్ ని తెరకెక్కిస్తున్న సంగతి తెలిసిందే. ఇందులో గోపీచంద్ వకీలుగా దర్శనమివ్వనుండగా.. అతనికి జోడీగా రాశీఖన్నా నటించబోతోందని టాక్. అంతేకాదు.. ఈ సినిమా కోసమే ఫన్నీగా సాగే టీవీ సీరియల్ యాక్ట్రెస్‌గా రాశి కనిపించనుందట.
మారుతి గత చిత్రం 'ప్రతి రోజూ పండగే'లో రాశీఖన్నా.. టిక్ టాక్ సెలబ్రిటీ ఏంజెల్ ఆర్ణగా ఆకట్టుకున్న సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలోనే.. 'పక్కా కమర్షియల్'లోనూ రాశి కోసం ఈ టీవీ సీరియల్ యాక్ట్రెస్ రోల్ ని డిజైన్ చేశాడట మారుతి. మరి.. మిస్ ఖన్నా నయా అవతారం ఆమెకు ఎలాంటి ఫలితాన్ని అందిస్తుందో తెలియాలంటే అక్టోబర్ 1 వరకు వేచి చూడాల్సిందే.
![]() |
![]() |