![]() |
![]() |

టాలీవుడ్ చందమామ కాజల్ అగర్వాల్, ఆమె భర్త గౌతమ్ కిచ్లు ఫిబ్రవరి 14 వాలెంటైన్స్ డేని ఎక్కడ సెలబ్రేట్ చేసుకున్నారో తెలుసా? ఏ ఫైవ్ స్టార్ హోటల్‌లోనో, ఇంకేదైనా ఖరీదైన డెస్టినేషన్‌లోనో అనుకుంటున్నారా? అయితే తప్పులో కాలేసినట్లే. ఆ ఇద్దరూ ఆదివారం తమిళనాడులోని పొల్లాచ్చికి వెళ్లారు. అక్కడి శాంతి మెస్‌కి వెళ్లి ఢిన్నర్ చేశారు. అది కాజల్ ఫేవరేట్ మెస్. దానిని ఇద్దరు భార్యాభర్తలు నడుపుతున్నారు. ఆ ఇద్దరితో కలిసి ఫొటోలకు పోజులు కూడా ఇచ్చారు కాజల్ అండ్ గౌతమ్. వాటిని తన ఇన్‌స్టాగ్రామ్ స్టోరీస్‌లో షేర్ చేసింది కాజల్. "వేలంటైన్స్ డేట్ నైట్. మేం ఎక్కడ ఉన్నామో ఏమైనా ఊహించగలరా?" అంటూ దానికి క్యాప్షన్ జోడించింది.

ఆ తర్వాత, "పొల్లాచ్చిలో మా ఫేవరేట్ శాంతి మెస్. అక్కడ ప్రేమతో శాంతి అక్క, బాలాకుమార్ అన్న మాకు వడ్డించారు. అందుకే 27 సంవత్సరాలుగా అక్కడి భోజనం ఎంతో రుచికరంగా ఉంటోంది. తొమ్మిదేళ్లుగా నేను వారి ఆదరపూర్వకమైన చిన్న మెస్‌కు వెళ్తూ ఉన్నాను." అని రాసుకొచ్చింది.
కాజల్ అంటే సరే.. ఆమెకు బాగా ఇష్టమైన ప్లేస్ కాబట్టి, అలాంటి ఓ మామూలు మెస్‌కు వెళ్లి గడిపింది. కానీ గౌతమ్ ఎందుకు వెళ్లాలి? అయినా భార్య ఇష్టాన్ని తన ఇష్టంగా భావించి, ఎలాంటి భేషజం లేకుండా, హోదాలు, స్థాయిలు పట్టించుకోకుండా ఆ మధ్యతరగతి మెస్‌కు వెళ్లాడు. చాలా సంతోషంగా కాజల్‌తో పాటు అక్కడ గడిపాడు. ప్రేమికుల దినోత్సవం నాడు కాజల్ దంపతులు తమ మెస్‌కు వచ్చి, భోజనం చేయడంతో పాటు, తమతో కొద్దిసేపు గడపడంతో, ఆ మెస్‌ను నడుపుతున్న శాంతి, బాలాకుమార్ దంపతుల ఆనందానికి అవధులు లేవు. కాజల్ దంపతుల మంచి హృదయానికి వారు పొంగిపోయారు.

![]() |
![]() |