![]() |
![]() |

లాక్‌డౌన్ కారణంగా బుల్లితెర రియాలిటీ షో బిగ్‌బాస్ సీజన్ 4 కాస్త ఆలస్యంగా మొదలైన విషం తెలిసిందే. కరోనా, లాక్‌డౌన్ సమస్యల కారణంగా ఈ షోలో పాల్గొనడానికి పెద్దగా పేరున్న సెలబ్రిటీలెవ్వరూ ఇందులో పాల్గొనడానికి ఆసక్తిని చూపించకపోవడంతో యూట్యూబ్ స్టార్స్‌తో పాటు సినిమాల్లో ఓ మోస్తరు పాపులారిటీ వున్న వారిని కంటెస్టెంట్‌లుగా ఎంపిక చేసి నాగ్ హోస్ట్‌గా షోని ప్రారంభించారు.
అయితే ఈ షో పై ప్రారంభంలో చాలా విమర్శలు వినిపించాయి. ఊరూ పేరు లేని వారిని కంటెస్టెంట్‌లుగా ఎంపిక చేసి ఏదో ఈ సీజన్ ఇలా కానిచ్చేద్దాం అన్నట్టుగా బిగ్‌బాస్ నిర్వాహకులు వ్యవహరిస్తున్నారని నెటిజన్స్ ఘాటు విమర్శలు చేశారు అయితే బిగ్‌బాస్ వేసిన లవ్ మంత్రంతో సీజన్ 4 ఒక్కసారిగా వార్తల్లో నిలిచింది. ఇందులో ప్రధాన భూమిక పోషించింది అభిజీత్, మోనాల్, అఖిల్ సార్థక్, దేత్తడి హారిక. ఈ నలుగురిలో ముందు అభిజీత్‌తో లవ్‌ట్రాక్‌ని మోనాల్ మొదలుపెట్టింది. అది బెడిసి కొట్టడంతో వెంటనే అఖిల్‌తో ప్రేమాయణం స్టార్ట్ చేసి పులిహోర కలపడం మొదలుపెట్టింది. వీరిద్దరి ప్రేమాయణం మెగాస్టార్ చిరు కూడా ప్రస్తావించేంత వరకూ వెళ్లిందంటే వీరు ఏ రేంజ్‌లో బిగ్‌బాస్ లవ్ మంత్రని రక్తికట్టించారో అర్థం చేసుకోవచ్చు.
బయటికి వచ్చాక కూడా వీరి మధ్య అదే ట్రాక్ కంటిన్యూ అవుతుండటం గమనార్హం. అయితే దీన్ని క్యాష్ చేసుకోవాలని ఏకంగా ఓ నిర్మాణ సంస్థ వీరిద్దరితో ఓ వెబ్ సిరీస్‌ని ప్లాన్ చేసింది. దాని పేరు 'తెలుగు అబ్బాయి గుజరాతీ అమ్మాయి'. మోనాల్‌ది గుజరాత్ కావడంతో అదే పేరుని సినిమాకు జత చేశారు. భాస్కర్ బంటుపల్లి దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రాన్ని ఏ. భాస్కర్‌రావు నిర్మిస్తున్నారు. ప్రేమికుల రోజున ఈ వెబ్ సిరీస్ ఫస్ట్ లుక్‌ని చిత్ర బృందం విడుదల చేసింది. మార్చి సెకండ్ వీక్ నుంచి ఈ వెబ్ డ్రామాని షూట్ చేయబోతున్నారు.

![]() |
![]() |