![]() |
![]() |

చిన్న చిన్న వేషాలతో కెరీర్ ని ఆరంభించిన నవీన్ పోలిశెట్టి.. 'ఏజెంట్ సాయి శ్రీనివాస ఆత్రేయ'తో కథానాయకుడిగా టర్న్ అయ్యాడు. అనూహ్య విజయం సాధించిన సదరు కామెడీ థ్రిల్లర్ తో పరిశ్రమ దృష్టిని ఆకర్షించాడు. ప్రస్తుతం 'జాతి రత్నాలు' అనే సినిమా చేస్తున్నాడు నవీన్. మహాశివరాత్రి కానుకగా మార్చి 11న ఈ హిలేరియస్ ఎంటర్ టైనర్.. జనం ముందుకు రానుంది. ఇదిలా ఉంటే.. ఓ క్రేజీ ప్రాజెక్ట్ లో స్టార్ హీరోకి ఫ్రెండ్ రోల్ లో నటించేందుకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చాడట నవీన్.
ఆ వివరాల్లోకి వెళితే.. యంగ్ టైగర్ యన్టీఆర్ తో మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ శ్రీనివాస్ ఓ సినిమా చేయబోతున్న సంగతి తెలిసిందే. ప్రస్తుతం ప్రి-ప్రొడక్షన్ వర్క్ జరుపుకుంటున్న ఈ భారీ బడ్జెట్ మూవీ.. త్వరలోనే సెట్స్ పైకి వెళ్లనుంది. కాగా ఇందులో తారక్ కి స్నేహితుడిగా, కథను కీలక మలుపు తిప్పే పాత్రలో నవీన్ నటించబోతున్నాడంటూ ప్రచారం సాగుతోంది. ఇందులో నిజానిజాలెంతో తెలియాలంటే కొన్నాళ్ళు వేచిచూడాల్సిందే.
యన్టీఆర్ 30గా తెరకెక్కనున్న ఈ క్రేజీ ప్రాజెక్ట్ ని యన్టీఆర్ ఆర్ట్స్, హారికా అండ్ హాసిని క్రియేషన్స్ సంయుక్తంగా నిర్మిస్తున్నాయి.
![]() |
![]() |