![]() |
![]() |

"నువ్వేమైనా రోమియో అనుకుంటున్నావా?"..
"ఛ.. వాడు ప్రేమకోసం చచ్చాడు. నేనాడి టైప్ కాదు."
'రాధేశ్యామ్' కథ వెనుక థీమ్ ఇదే.. అవును. ప్రభాస్ ఫ్యాన్స్ ఎన్నో రోజులుగా వెయిట్ చేస్తున్న ఫస్ట్ గ్లిమ్స్ వచ్చేసింది. ముందుగా ఎనౌన్స్ చేసినట్లుగానే సరిగ్గా ఈరోజు మార్నింగ్ 9 గంటల 18 నిమిషాలకు 52 సెకన్ల డ్యురేషన్ ఉన్న ఫస్ట్ గ్లిమ్స్‌ను సోషల్ మీడియా హ్యాండిల్స్ ద్వారా లాంచ్ చేశారు మేకర్స్. తెలుగు వెర్షన్ తోపాటు తమిళ, హిందీ వెర్షన్ల గ్లిమ్స్‌ను సైతం రిలీజ్ చేశారు. రిలీజ్ డేట్‌ను ఈ గ్లిమ్స్ ద్వారా అనౌన్స్ చేశారు. యస్. జూలై 30న 'రాధేశ్యామ్' మూవీ ప్రపంచవ్యాప్తంగా అత్యధిక థియేటర్లలో రిలీజ్ అయ్యేందుకు రెడీ అవుతోంది.
ఇటలీలోని ప్రకృతి సోయగాల మధ్య బొగ్గు ఇంజన్ ఉన్న ట్రైన్ చుక్ చుక్ అంటూ వేగంగా వస్తున్న విజువల్‌తో ఈ వీడియో స్టార్టయ్యింది. ఆ ట్రైన్ ఒక స్టేషన్‌లో ఆగింది. గుంపులు గుంపులుగా వచ్చే పోయే జనం.. ఆ జనం మధ్యలో నుంచి ఓ పొడవాడి హ్యాండ్సమ్ యంగ్ గై పైకి ఎగిరాడు. అతగాడే మన హీరో విక్రమాదిత్య. ఇటలీ లాంగ్వేజ్‌లో "సియనేంజిలో" అంటూ స్వీట్‌గా పిలిచాడు. అమ్మాయిలు, అబ్బాయిలు ఒక్కసారిగా ఆ పిలుపు వినిపించిన వైపు వెనక్కి తిరిగి చూశారు. అమ్మాయిలైతే అతడి వంక నవ్వుతూ చూస్తూ ముందుకు నడిచారు. ప్రభాస్ నవ్వుతూనే ఇటాలియన్‌లోనే ఇంకో రెండు మూడు మాటలు చెప్పాడు. అదిగో.. అప్పుడు ఆ జనం మధ్యలోంచి చిరునవ్వులు చిందిస్తూ, హంసలా వయ్యారంగా నడుస్తూ, దివి నుంచి భువికి దిగివచ్చిన అప్సరసలా బ్లూ గౌన్ ధరించి ప్రత్యక్షమైంది మన హీరోయిన్ ప్రేరణ.
"నువ్వేమైనా రోమియో అనుకుంటున్నావా? ఆ.." అనడిగింది. ఆమె కళ్లల్లో కళ్లు పెట్టి చూస్తూ, "ఛ.. వాడు ప్రేమకోసం చచ్చాడు. నేనాడి టైప్ కాదు." అని జవాబిచ్చాడు విక్రమాదిత్య. అంతే.. అంతకుమించి ఈ గ్లిమ్స్‌లో వేరే విజువల్స్ ఏమీ లేవు. కానీ ఆ రెండే రెండు డైలాగ్స్‌తో విక్రమాదిత్యగా ప్రభాస్ క్యారెక్టరైజేషన్ ఏమిటనేది చెప్పేశాడు డైరెక్టర్ రాధాకృష్ణ కుమార్. ఈ మూవీలో ప్రభాస్ ప్రేమకోసం చచ్చే రకం కాదనీ, ప్రేమలో గెలిచే రకమనీ, తన ప్రేమకు అడ్డువచ్చిన వాళ్ల భరతం పట్టే ధీరుడనీ అర్థమైపోతుంది. ప్రేరణ కోసం అతడు ఏం చేశాడనేది సినిమాలో మనం చూడబోతున్నాం. ప్రేరణగా ఎప్పట్లా పూజా హెగ్డే వర్ణింపశక్యం కానంత మెరుపుతీగలా మెరిసిపోతోంది. అందంలో పోటీపడేట్లు ఉన్న ప్రభాస్, పూజా పెయిర్‌ను చూడ్డానికి రెండు కళ్లూ చాలవని ఊహించవచ్చు.

ఈ చిన్న వీడియోలో కనిపించిన ట్రైన్ కానీ, జనం కాస్ట్యూమ్స్ కానీ గమనిస్తే.. 'రాధేశ్యామ్' అనేది 1980ల కాలంలో ఇటలీలో జరిగిన లవ్ స్టోరీగా తెలుస్తోంది. ప్రభాస్, పూజ మినహా ఈ గ్లిమ్స్‌లో మరో క్యారెక్టర్ కనిపించలేదు. అయితే ఆ విజువల్స్ చూస్తుంటే ఎంత రిచ్‌గా 'రాధేశ్యామ్' రూపొందుతోందో అర్థమవుతోంది. ఆ విజువల్స్ వెనుక వున్నది సినిమాటోగ్రాఫర్ మనోజ్ పరమహంస. అలాగే బీజియం సృష్టికర్త జస్టిన్ ప్రభాకరన్. ఇంటర్నేషనల్ స్టాండర్డ్స్‌లో ఈ మూవీ తయారవుతుందని చెప్పేందుకు బీజియం, విజువల్స్ నిదర్శనం.
పరమహంస అనే ఓ కీలక పాత్రలో సీనియర్ రెబల్ స్టార్ కృష్ణంరాజు నటిస్తోన్న ఈ ఫిల్మ్‌లో ప్రభాస్ మదర్‌గా నిన్నటి తరం మెరుపుతీగ భాగ్యశ్రీ కనిపించనున్నారు. మురళీశర్మ, కునాల్ రాయ్ కపూర్, సచిన్ ఖడేకర్, ప్రియదర్శి ఇతర ముఖ్యపాత్రధారులైన 'రాధేశ్యామ్'ను గోపీకృష్ణా మూవీస్, యువీ క్రియేషన్స్ సంస్థలు సంయుక్తంగా నిర్మిస్తున్నాయి.
ఫస్ట్ గ్లిమ్స్ పేరిట తెచ్చిన శాంపుల్ విజువల్స్‌తో ప్రభాస్ ఫ్యాన్స్ సంబరం అంతా ఇంతా కాదు. రిలీజ్ డేట్‌కు ఇప్పట్నుంచే వాళ్లు కౌంట్ డౌన్ మొదలుపెట్టేశారు. ఇక రాబోయే రోజుల్లో సాంగ్స్, టీజర్, ట్రైలర్స్‌తో ఎలాంటి సంచలనాలు నమోదవుతాయో, 'రాధేశ్యామ్'పై ఎక్స్‌పెక్టేషన్స్ ఏ రేంజికి వెళ్తాయో ఊహించలేం.
![]() |
![]() |