![]() |
![]() |

కింగ్ నాగార్జున, గరుడవేగ ఫేమ్ ప్రవీణ్ సత్తారు కాంబినేషన్ లో ఓ యాక్షన్ ఎంటర్ టైనర్ తెరకెక్కనున్న సంగతి తెలిసిందే. అతి త్వరలోనే ఈ క్రేజీ ప్రాజెక్ట్ పట్టాలెక్కనుంది.
ఇదిలా ఉంటే.. ఈ సినిమాలో నాగ్ కి జోడీగా విశ్వాసమ్ ఫేమ్ అనిఖ సురేంద్రన్ నటించనున్నట్లు వార్తలు వినిపిస్తున్న సంగతి తెలిసిందే. కాగా, ఇందులో ఓ కీలక పాత్రలో బాలీవుడ్ యాక్ట్రస్ గుల్ పనాగ్ దర్శనమివ్వనుందని టాక్. కథను మలుపు తిప్పే పాత్ర ఇదని.. అభినయానికి ఆస్కారమున్న పాత్ర కావడంతో గుల్ పనాగ్ ఈ ప్రాజెక్ట్ కి వెంటనే ఓకే చెప్పిందని వినికిడి. త్వరలోనే నాగ్, ప్రవీణ్ సత్తారు కాంబో మూవీలో గుల్ పనాగ్ ఎంట్రీపై క్లారిటీ వస్తుంది.
నాగార్జున నటించిన తాజా చిత్రం వైల్డ్ డాగ్ విడుదలకు సిద్ధమైంది. అహిషోర్ సాల్మన్ దర్శకత్వం వహించిన ఈ సినిమాలో నాగ్ కి జోడీగా దియా మీర్జా నటించగా.. ఓ కీలక పాత్రలో రేయ్ ఫేమ్ సయామీ ఖేర్ కనిపించనుంది.
![]() |
![]() |