![]() |
![]() |

బిగ్‌బాస్ సీజన్ 4 బ్యూటీ అందాల దివి వడ్త్య మంచి పాపులారిటీని సొంతం చేసుకున్న విషయం తెలిసిందే. బిగ్‌బాస్ కారణంగా చాలా వరకు పాపులర్ ఫేస్‌గా మారిన దివి ఏకంగా బిగ్‌బాస్ ఫైనల్ సందర్భంగా మెగాస్టార్ చిరంజీవినే తన అందంతో ఫిదా చేసింది. తను నటిస్తున్న 'లూసీఫర్' తెలుగు రీమేక్‌లో పోలీస్ ఆఫీసర్ పాత్రని పట్టేసి గోల్డెన్ ఆఫర్‌ని దక్కించుకుంది.
తాజాగా బిగ్‌బాస్ ఉత్సవంలో తనదైన డ్యాన్సులతో హొయలొలికించి అదరగొట్టిన దివి 'క్యాబ్ స్టోరీస్ వాల్యూమ్ 1' పేరుతో రూపొందుతున్న వీడియో ఆల్బమ్‌లో రచ్చ చేయబోతోంది. ఇటీవలే దీనికి సంబంధించిన ప్రోమోని మేకర్స్ రిలీజ్ చేశారు. ఓ కాన్సెప్ట్ థీమ్‌తో 'కిస్కో పతా హై సాలా' పేరుతో రూపొందించిన సాంగ్‌తో వీడియో ఆల్బమ్ ప్రోమో విశేషంగా ఆకట్టుకుంటోంది.
దీనికి సంబంధించిన పోస్టర్‌ను తన ఇన్‌స్టా హ్యాండిల్ ద్వారా షేర్ చేసిన దివి, దానికి "కిస్కో పతా హై సాలా.. కాషన్.. బ్యాడాస్ సాంగ్ కమింగ్ యువర్ వే!" అంటూ క్యాప్షన్ జోడించింది.
ఈ పాటలో అందాలు ఆరబోస్తూ దివి చేసిన రచ్చ అంతా ఇంతా కాదు. హాట్ హాట్ అందాలని ఆరబోస్తూ మత్తెక్కించే చూపుల్తో, కైపెక్కించే కళ్లతో కుర్రకారుని ప్రోమోతోనే పడేసింది దివి. 'క్యాబ్ స్టోరీస్' పేరుతో దివి వరుసగా వీడియో ఆల్బమ్స్ చేయబోతున్నట్టుగా తెలుస్తోంది. ఈ ఆల్బమ్‌లో టాలీవుడ్‌లో దివి మరిన్ని క్రేజీ ఆఫర్లని దక్కించుకోవడం గ్యారెంటీ అంటున్నారు.

![]() |
![]() |