![]() |
![]() |

నటి సన టీవి సీరియల్స్‌తో పాపులర్ అయింది. ఆ తరువాత సినిమాల్లో క్యారెక్టర్ ఆర్టిస్ట్‌గా, స్టార్ హీరోల చిత్రాల్లో వదిన పాత్రల్లో నటించి మెప్పిస్తోంది. ప్రస్తుతం సినిమాల్లో చాలా తక్కువగా కనిపిస్తున్న సన తాజాగా ఓ ఇంటర్వ్యూలో పలు ఆసక్తికర విషయాల్ని వెల్లడించింది. పనిలో పనిగా బాత్‌రూమ్ సీన్‌కి సంబంధించిన సీక్రెట్‌ని బయటపెట్టి షాకిచ్చింది.
హీరోయిన్‌లకి ఏమాత్రం తగ్గని వన్నె తరగని అందం సన సొంతం. అయితే హీరోయిన్ కావాలనుకున్న సన క్యారెక్టర్ ఆర్టిస్ట్‌గా స్థిరపడిపోయింది. స్టార్ హీరోలు నటించిన బ్లాక్ బస్టర్ హిట్ చిత్రాల్లో నటించి మెప్పించిన సన ఓ మలయాళ చిత్రంలో నటించిందట. అయితే ఆ సినిమాలో ఓ బోల్డ్ సీన్‌లో నటించాల్సి వచ్చిందని వివరించింది.
ఓ మలయాళ సినిమాలో హీరో తండ్రీ కొడుకులుగా ద్విపాత్రాభినయం చేశాడట. తండ్రి పాత్రకు జోడీగా తాను నటించానని, అయితే హీరో భార్యపై ప్రేమని చూపించే ఓ సన్నివేశం వుందని, ఆ సన్నివేశంలో తను బాత్‌రూమ్ నుంచి కేవలం టవల్ కట్టుకుని బయటికి వస్తుంటానని, అప్పుడు సదరు హీరో తనని గ్గటిగా కౌగిలించుకోవాలని.. ఈ సన్నివేశం చెప్పినప్పుడు భయపడ్డానని, అయితే చిన్న సీనే కదా అని తన తండ్రి సపోర్ట్ చేయడంతో ఆ సన్నివేశంలో నటించానని నటి సన తను నటించిన బాత్ రూమ్ సీన్ సీక్రెట్‌ని రీసెంట్‌గా బయటపెట్టడం ఆకట్టుకుంటోంది.
![]() |
![]() |