![]() |
![]() |

ఇస్మార్ట్ శంకర్ వంటి బ్లాక్ బస్టర్ మూవీ తరువాత పూరీ జగన్నాథ్ దర్శకత్వంలో రూపొందుతున్న చిత్రం లైగర్. యూత్ ఐకాన్ విజయ్ దేవరకొండ కథానాయకుడిగా నటిస్తున్న ఈ క్రేజీ ప్రాజెక్ట్.. పాన్ ఇండియా మూవీగా హిందీ, తెలుగు, తమిళ్, కన్నడ, మలయాళ భాషల్లో విడుదల కానుంది. గురువారం ఈ సినిమా రిలీజ్ డేట్ ని సెప్టెంబర్ 9గా కన్ఫామ్ చేసింది యూనిట్.
ఆసక్తికరమైన విషయమేమిటంటే.. పూరీ జగన్నాథ్ కి సెప్టెంబర్ మాసంతో ప్రత్యేక అనుబంధం ఉందనే చెప్పాలి. ఎందుకంటే.. ఇదే నెల (సెప్టెంబర్) 28 తన పుట్టినరోజు. అంతేకాదు.. వేర్వేరు సంవత్సరాల్లో ఇదే సెప్టెంబర్ నెలలో రిలీజైన పూరి చిత్రాలు ఇట్లు శ్రావణి సుబ్రమణ్యం (2001), చిరుత (2007) మంచి విజయం సాధించాయి. మరి.. సెంటిమెంట్ మంత్ లో వస్తున్న లైగర్ కూడా పూరి ఖాతాలో మరో సక్సెస్
ని చేరుస్తుందేమో చూడాలి.
లైగర్ లో విజయ్ దేవరకొండకి జోడీగా బాలీవుడ్ బ్యూటీ అనన్య పాండే నటిస్తుండగా.. సీనియర్ హీరోయిన్ రమ్యకృష్ణ ముఖ్య పాత్రలో దర్శనమివ్వనున్నారు.
![]() |
![]() |