![]() |
![]() |

క్యూట్ గాళ్ రాశీ ఖన్నా షూటింగ్‌కు బ్రేక్ రావడంతో హాలీడేస్‌ను ఎంజాయ్ చేయడానికి గోవా చెక్కేసింది. అక్కడ ఓ స్విమ్మింగ్ పూల్ ఒడ్డున బికినీలో కూర్చొని ఫొటోలకు పోజులిచ్చింది. వీటిని తన ఇన్‌స్టాగ్రామ్ హ్యాండిల్‌లో షేర్ చేసింది. వాటిలో తన క్లోజ్ ఫ్రెండ్ జెనా కొత్వాల్‌తో దిగిన పిక్చర్స్ కూడా ఉన్నాయి. రాశీ బ్యూటిఫుల్ ఫిట్ బాడీ చూడ్డానికి రెండు కళ్లూ చాలవనేది నిజం. ప్రస్తుతం సోషల్ మీడియాలో ఈ ఫొటోలు హాట్ హాట్‌గా వైరల్ అవుతున్నాయి.

నిపుణుడైన శిల్పి శ్రద్ధగా చెక్కినట్లు తీర్చిదిద్దిన అవయవ సౌష్టవంతో రాశీ మతులు పోగొడుతోంది. అలాంటి ఫిట్ బాడీ ఎలా సాధ్యమైందో కూడా తన పోస్ట్‌లో రాసుకొచ్చింది రాశీ.

తన ట్రైనర్ కుల్దీప్ సేథీ ఒక ఏడాదిగా కష్టపడి తనను ఇలా మార్చేశాడని ఆమె వెల్లడించింది. వర్కవుట్స్‌తో పాటు ఆరోగ్యకరమైన డైట్ కూడా తనకు అతను అలవాటు చేశాడని ఆమె తెలిపింది.

అతని వల్లే తనకు ఫిట్ అండ్ హెల్దీ బాడీ వచ్చిందని చెప్పింది రాశీ. మీరు మీ బాడీని ప్రేమించేవాళ్లయితే వర్కవుట్స్ చేయమనీ, డైట్స్‌ను క్రాష్ చేయొద్దనీ సలహా కూడా ఇచ్చింది.

“Slow and steady wins the race!” అని తన పోస్ట్‌కు ఫైనల్ టచ్ ఇచ్చింది 'ప్రతిరోజూ పండగే' హీరోయిన్.



![]() |
![]() |