![]() |
![]() |

కేంద్రం ప్రవేశ పెడుతున్న నూతన వ్యవసాయ చట్టాలపై రైతులు గత కొన్ని రోజులుగా ఉద్యమం చేస్తున్న విషయం తెలిసిందే. కేంద్రం తెస్తున్న కొత్త వ్యవసాయ చట్టాలపై పంజాబ్, హర్యానాకు చెందిన రైతులు ఢిల్లీ శివార్లతో గత రెండు నెలలుగా ఉద్యమం చేస్తున్నారు. ఇటీవల ఇది హింసాత్మకం కావడంతో కేంద్రం ఢిల్లీ శివార్లకు 50 వేల మంది పోలీసు బలగాలని తరలించి రైతు ఉద్యమాన్ని అణచే ప్రయత్నాలు మొదలుపెట్టింది.
రైతు ఉద్యమానికి కొంత మంది సెలబ్రిటీలు మద్దతుగా నిలుస్తుంటే కొంత మంది వ్యతిరేకిస్తున్నారు. ఇటీవల మాజీ అడల్ట్ మూవీ స్టార్ మియా ఖలీఫా కూడా రైతు ఉద్యమానికి మద్దతుగా నిలిచిన విషయం తెలిసిందే. తాజాగా ఈ జాబితాలో మరో ఇంటర్నేషనల్ స్టార్, బ్రిటీష్ నటి జమీలా జమీల్ చేరింది. తను కూడా ఇండియాలో జరుగుతున్న రైతు ఉద్యమానికి తన మద్దతు వుంటుందని తెలిపింది. అయితే తనకు బెరిదింపులు వస్తున్నాయని చెబుతోంది.
రైతు ఉద్యమానికి అండగా నిలిచినందుకు తనని కొంత మంది టార్గెట్ చేస్తున్నారని, చంపేస్తామంటూ సోషల్ మీడియా వేదికగా బెదరిస్తున్నారని పేర్కొంది. అంతే కాకుండా తనని రేప్ చేస్తామంటూ కూడా బెదిరిస్తున్నారని వెల్లడించింది జమీలా జమీల్.

![]() |
![]() |