![]() |
![]() |

'హేట్ స్టోరీ 4' మూవీతో అలరించి, గత ఏడాది నేరుగా జీ5లో రిలీజైన 'వర్జిన్ భానుప్రియ' మూవీలో టైటిల్ రోల్ పోషించడం ద్వారా వార్తల్లో కెక్కిన బాలీవుడ్ బ్యూటీ, టాప్ మోడల్ ఊర్వశి రౌతేలా త్వరలో 'బ్లాక్ రోజ్' సినిమాతో టాలీవుడ్‌లో అడుగుపెట్టనుంది. 'సర్కారువారి పాట'లో మహేశ్‌తో ఓ స్పెషల్ సాంగ్ చేయడానికి ఆమెను సంప్రదించారంటూ ఇటీవల వార్తలు కూడా వచ్చాయి. కాగా ఊర్వశి ఓ అరుదైన ఘనతను సొంతం చేసుకుంది.
టాప్ 10 వరల్డ్స్ సెక్సియెస్ట్ సూపర్ మోడల్ 2021 లిస్ట్‌లో చోటు సంపాదించుకున్న తొలి భారతీయురాలిగా ఆమె నిలిచింది. దీంతో ఆమె ఆనందంతో ఉబ్బితబ్బిబ్బవుతోంది. తన ఇన్‌స్టాగ్రామ్ హ్యాండిల్ ద్వారా తన ఆనందాన్ని వ్యక్తం చేస్తూ, "ట్రూలీ హంబుల్డ్! దైవ ప్రమాణంగా నేను ఆశ్చర్యపోయాను. ఏదేమైనా, నేను ప్రయత్నించే విషయంలో మొదటి స్థానంలో ఉండాలని ఆశిస్తూ ఉంటాను. నా ఇమేజ్/ లుక్ విషయంలో నేనెలాంటి ప్రయత్నం చేయలేదు. ఇది దేవుడు నాకిచ్చిన కానుక. ప్రపంచవ్యాప్తంగా కురుస్తోన్న ప్రేమకు ఆనందంతో తబ్బిబ్బవుతున్నా." అంటూ రాసుకొచ్చింది.
కాగా ఇన్‌స్టాగ్రామ్‌లో ఊర్వశిని ఫాలో అవుతున్న వారి సంఖ్య 34 మిలియన్ మార్క్‌ను చేరుకుంది. దీనికి కూడా సంతోషాన్ని వ్యక్తం చేసిందామె.
![]() |
![]() |