![]() |
![]() |

తెలుగునాట కథానాయికగా తిరుగులేని స్టార్ డమ్ చూసారు సమంత. పదేళ్ళకి పైగా నాయికగా రాణిస్తున్న ఈ టాలెంటెడ్ బ్యూటీ.. త్వరలో డిజిటల్ ఎంట్రీ ఇవ్వబోతున్నారు. ద ఫ్యామిలీ మ్యాన్ సీజన్ 2 కోసం సామ్.. ప్రతినాయకురాలి అవతారమెత్తారు. రాజ్, డీకే డైరెక్ట్ చేసిన ఈ సిరీస్.. ఫిబ్రవరి 12న స్ట్రీమ్ కాబోతోందని సమాచారం.
ఆసక్తికరమైన విషయమేమిటంటే.. నాయికగా సామ్ నటించిన తొలి చిత్రం ఏమాయ చేసావె కూడా 2010లో ఫిబ్రవరి నెలలోనే విడుదలైంది. సదరు చిత్రం బాక్సాఫీస్ వద్ద విజయం సాధించడమే కాకుండా సామ్ భవిష్యత్ కి బంగారు బాట వేసింది. మరి.. డిజిటల్ వరల్డ్ లోకి ఎంట్రీ ఇస్తూ సామ్ చేస్తున్న ఈ తొలి ప్రయత్నం కూడా ఫిబ్రవరి సెంటిమెంట్ ని రిపీట్ చేసి.. సమంతకి అక్కడ కూడా గ్రాండ్ సక్సెస్ ని అందిస్తుందేమో చూడాలి.
![]() |
![]() |