![]() |
![]() |

థియేటర్ల కోసం తీసిన సినిమాలను పరిస్థితుల ప్రభావం వలన ఓటీటీల్లో విడుదల చేశారు. అలా కాకుండా ఓటీటీ కోసం రూపొందుతున్న వెబ్ సిరీస్, సినిమాల్లో స్టార్లు నటిస్తున్నారు.'అనగనగా ఓ అతిథి'లో పాయల్ రాజ్‌పుత్ నటించింది. 'లెవెన్త్ అవర్'లో తమన్నా నటించింది. సమంత 'ఫ్యామిలీ మాన్ 2' వెబ్ సిరీస్ చేసింది. వీళ్లది నిజమైన డిజిటల్ డెబ్యూ. ఈ లిస్టులో సునీల్ కూడా చేరుతున్నట్టు టాక్.
'కలర్ ఫోటో'తో సునీల్ డిజిటల్ డెబ్యూ జరిగింది. అయితే, అది థియేటర్ల కోసం తీసిన సినిమా. కరోనా వల్ల ఓటీటీలోకి వచ్చింది. ఈసారి కేవలం ఓటీటీ కోసం దర్శకుడు వీఎన్ ఆదిత్య తీయబోతున్న సినిమాలో నటించడానికి సునీల్ ఓకే చెప్పాడట. అనిల్ సుంకరకి చెందిన ఏకే ఎంటర్టైన్మెంట్స్ ప్రొడక్షన్స్ ప్రొడ్యూస్ చేయనున్న ఈ సినిమాకి ఆల్రెడీ సునీల్ సంతకం కూడా చేశారట. త్వరలో షూటింగ్ స్టార్ట్ చేయవచ్చు.
![]() |
![]() |