![]() |
![]() |

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ హీరోగా నటిస్తున్న 'వకీల్ సాబ్' లాస్ట్ షెడ్యూల్ నవంబర్ మొదటి వారం నుండి మొదలు కానుంది. వాస్తవానికి, గత మే నెలలో విడుదల కావాల్సిన సినిమా. విడుదల ఎప్పుడు అనేది పక్కన పెడితే చిత్రీకరణ ఇంకా పూర్తి కాలేదు. కరోనా వల్ల బ్రేకులు పడింది. ఇటీవల మళ్ళీ సినిమాను సెట్స్ మీదకు తీసుకువెళ్లారు. అంజలి, నివేదా థామస్, అనన్య మీద సన్నివేశాలు తీశారు. ప్రజెంట్ బ్రేక్ ఇచ్చారు. నవంబర్ మొదటివారంలో మొదలయ్యే షెడ్యూల్ లో పవన్ జాయిన్ అవుతారని తెలిసింది.
నవంబర్ నుండి బ్రేకులు లేకుండా సినిమా కంప్లీట్ అయ్యేవరకు నాన్ స్టాప్ గా షూటింగ్ చేయడానికి ప్లాన్ చేశారట. డిసెంబర్ ఎండింగ్ కి సినిమా రెడీగా ఉండాలని టార్గెట్ కింద పెట్టుకున్నారట. పవన్ కూడా నాన్ స్టాప్ షెడ్యూల్ కి గ్రీన్ సిగ్నల్ ఇచ్చారని యూనిట్ వర్గాలు అంటున్నాయి. కుదిరితే సంక్రాంతికి లేదంటే వేసవికి సినిమాను విడుదల చేయాలని అనుకుంటున్నారట.
![]() |
![]() |