![]() |
![]() |

యంగ్ టైగర్ ఎన్టీఆర్ హీరోగా పూరి జగన్నాథ్ దర్శకత్వం వహించిన 'టెంపర్' ఉంది కదా! దీని స్టోరీ లైన్ తీసుకుని హిందీలో 'సింబ'గా రీమేక్ చేశారు. రణ్‌వీర్ సింగ్ హీరోగా నటించగా, రోహిత్ శెట్టి దర్శకత్వం వహించారు. ఇప్పుడీ బాలీవుడ్ హీరో, డైరెక్టర్ కాంబినేషన్లో మరో సినిమా 'సర్కస్' రూపొందుతోంది. 'సింబ' యాక్షన్ సినిమా కాగా, 'సర్కస్' కామెడీ సినిమా. కామెడీ ఆఫ్ ఎర్రర్స్ కాన్సెప్ట్ తీసుకుని చేస్తున్న సినిమా. ఇందులో బుట్టబొమ్మ పూజా హెగ్డేకి అవకాశం వచ్చింది.
'సర్కస్'లో రణ్‌వీర్ సింగ్ సరసన జాక్వలైన్ ఫెర్నాండేజ్, పూజా హెగ్డే హీరోయిన్లు. కమెడియన్ వరుణ్ శర్మ ఇంపార్టెంట్ రోల్ చేస్తున్నాడు. దర్శకుడు రోహిత్ శెట్టి ఓ నిర్మాతగా వ్యవహరించనున్న ఈ సినిమాను టీ-సిరీస్ భూషణ్ కుమార్, రిలయన్స్ ఎంటర్టైన్మెంట్ ప్రొడ్యూస్ చేయనున్నాయి.
![]() |
![]() |