![]() |
![]() |

మరణించడానికి ముందు రోజు రాత్రి ప్రేయసి రియా చక్రవర్తిని సుశాంత్ కలిశాడా? అతని సోదరి శ్వేతా సింగ్ కృతి 'అవును' అనే అంటున్నారు. వాళ్ళిద్దరూ కలిశారనడానికి ఆధారాలు ఉన్నాయని ఆమె చెబుతున్నారు. విట్నెస్ ఒకరు ఉన్నారట. జూన్ 14న సుశాంత్ సింగ్ రాజ్ పుత్ ఈ లోకాన్ని విడిచి వెళ్ళాడు. అతడిది ఆత్మహత్య అని ముంబై పోలీసులు ప్రకటించారు. కథానాయకుడిగా మంచి స్థానంలో ఉన్న అతను ఆత్మహత్య ఎందుకు చేసుకున్నాడో అని అభిమానులు, ప్రేక్షకులు ఆవేదన వ్యక్తం చేశారు. అతడి ఆత్మహత్య పై మొదట ఎవరికీ అనుమానాలు రాలేదు. అయితే సుశాంత్ తండ్రి కేకే సింగ్ కేసు పెట్టడంతో పరిస్థితి మొత్తం మారిపోయింది.
తన కుమారుడిని రియా చక్రవర్తి, ఆమె సోదరుడు షోవిక్ చక్రవర్తి ఆత్మహత్యకు ప్రేరేపించారని సుశాంత్ తండ్రి కేకే సింగ్ పేర్కొన్నారు. తర్వాత సుశాంత్ కుటుంబానికి, రియాకి మధ్యన గొడవలు ఒక్కొక్కటిగా బయటపడుతున్నాయి. కేసు పెట్టిన తర్వాత సుశాంత్ ఫ్యామిలీ మీద రియా ఆరోపణలు చేస్తే రియా మీద సుశాంత్ ఫ్యామిలీ ఆరోపణలు చేస్తోంది. సుశాంత్ మృతి మరుగునపడి డ్రగ్స్ కేసు తెరపైకి వచ్చింది. ఇప్పుడు సుశాంత్ సోదరి సోషల్ మీడియా పోస్టుతో మరోసారి అతడి మర్డర్ మిస్టరీ తెరపైకి వచ్చింది.
"ఇది నిజం. బ్రేకింగ్ న్యూస్... జూన్ 13వ తేదీ రాత్రి రియాను భాయ్ కలిశాడని ధ్రువీకరించగల విట్నెస్ ఒకరు ఉన్నారు. 13వ తేదీ రాత్రి ఏం జరిగితే మరుసటి రోజు ఉదయానికి భాయ్ మరణించాడు?" అని శ్వేతా పేర్కొన్నారు.
![]() |
![]() |