![]() |
![]() |

సుశాంత్ సింగ్ రాజ్‌పుత్ ఆత్మహత్య కేసులో అతడి గాళ్ ఫ్రెండ్ రియా చక్రవర్తి సిబిఐ విచారణ కోరుతూ ట్వీట్స్ వేశారు. అతడు మరణించి నెల రోజులు గడిచిన తరుణంలో సెంట్రల్ హోమ్ మినిస్టర్ అమిత్ షాను ట్యాగ్ చేస్తూ ఆమె ట్వీట్స్ చేశారు. సుశాంత్ ఆత్మహత్య చేసుకోవడానికి ప్రేరేపించిన ఒత్తిడి గురించి తాను తెలుసుకోవాలని అనుకుంటున్నట్టు ఆమె పేర్కొన్నారు.
సుశాంత్ స్వరాష్ట్రమైన బీహార్ నుండి కొందరు, పలువురు సినీ, రాజకీయ ప్రముఖులు సైతం సిబిఐ విచారణ కోరుతున్నారు. కొందరు పలువురు సినీ ప్రముఖులపై కేసులు వేశారు. రియా మీద కూడా ఒకరు కేసు వేశారు. ఇప్పుడు తన ప్రియుడి మృతి గురించి సీబీఐ విచారణ కోరుతూ రియా చక్రవర్తి ట్వీట్స్ చేయడంతో ప్రాధాన్యం సంతరించుకుంది.
రియా చక్రవర్తి ట్వీట్స్ చేసిన నేపథ్యంలో మహారాష్ట్ర హోమ్ మినిస్టర్ అనిల్ దేశ్‌ముఖ్ స్పందించారు. సుశాంత్ ఆత్మహత్య కేసులో సిబిఐ విచారణ అవసరం లేదని ఆయన అభిప్రాయపడ్డారు. ముంబై పోలీసులు కేసు విషయంలో అద్భుతంగా పురోగతి కనబరుస్తున్నారనీ, వాళ్ళు చేయగలిగినంత చేస్తున్నారని అనిల్ పేర్కొన్నారు.
![]() |
![]() |