![]() |
![]() |

సోషల్ మీడియాలో సెన్సేషనల్ స్టార్ విజయ్ దేవరకొండ పాపులారిటీ భారీ స్థాయిలో పెరుగుతూ పోతోంది. యూత్‌లో అతనికున్న క్రేజ్ అసాధారణమేనని చెప్పాలి. అమ్మాయిల కలల రాకుమారుడైన అతను చాలా స్వల్ప కాలంలోనే మిలియన్ల మంది అభిమానులను సంపాదించుకున్నాడు. కేవలం తెలుగు రాష్ట్రాల్లోనే కాదు, దేశవ్యాప్తంగా అతనికి అభిమానులుండటం విశేషం. సోషల్ మీడియాలో అయితే అతని క్రేజ్ మరింత ఎక్కువగా కనిపిస్తోంది. ఇన్‌స్టాగ్రామ్ ప్లాట్‌ఫామ్‌లో తాజాగా అతను మరో మైలురాయిని అందుకున్నాడు.
విజయ్ ఇన్‌స్టాగ్రామ్ అకౌంట్‌ను ఫాలో అవుతున్న వాళ్ల సంఖ్య 8 మిలియన్ల మార్కును క్రాస్ చేసింది. సౌత్ ఇండియాలోనే ఈ మార్కును దాటిన తొలి హీరోగా అతను రికార్డుల్లోకి ఎక్కాడు. అతనిని రాత్రికి రాత్రే స్టార్‌ను చేసిన 'అర్జున్‌రెడ్డి' మూవీ హిందీలో రీమేక్ కాగా, 'గీత గోవిందం', 'డియర్ కామ్రేడ్' సినిమాలు హిందీలో అనువాదమై మంచి ఆదరణ పొందాయి. ఇటీవల ఓటీటీలో విడుదలైన ఫ్లాప్ మూవీ 'వరల్డ్ ఫేమస్ లవర్'ను సైతం చెప్పుకోదగ్గ సంఖ్యలోనే జనం చూశారు. ఇవన్నీ అతని ఇన్‌స్టాగ్రామ్ పాపులారిటీని పెంచాయి.
విజయ్ ప్రస్తుతం పూరి జగన్నాథ్ డైరెక్షన్‌లో 'ఫైటర్' అనే పాన్ ఇండియా మూవీ చేస్తున్నాడు. యాక్షన్ ఎంటర్‌టైనర్‌గా తయారవుతున్న ఈ మూవీలో విజయ్ బాక్సర్‌గా కనిపించనున్నాడు. తెలుగుతో పాటు హిందీలోనూ ఏక కాలంలో నిర్మాణమవుతున్నందున ఈ సినిమాతో అతను స్ట్రయిట్‌గా హిందీ ప్రేక్షకులను పలకరించనున్నాడు.
![]() |
![]() |