![]() |
![]() |

నమ్మాల్సిందే. తాను సత్యహరిశ్చంద్రుడి భక్తుడినని, తను నిజాలే చెప్తాననీ, అబద్ధం చెప్పననీ అంటున్నాడు రామ్గోపాల్ వర్మ. ఒక చానల్ ఇంటర్వ్యూలో యాంకర్ అడిగిన ప్రశ్నకు ఈ విషయం చెప్పాడు. "గతంలో ఒక ఇంటర్వ్యూలో ఒక ఫిమేల్ యాంకర్ మీ డిజైర్ ఏమిటని అడిగితే, మిమ్మల్ని బికినీలో చూడ్డం అని ఎందుకు చెప్పార"ని చానల్ యాంకర్ ప్రశ్నించాడు.
"నేను సత్యహరిశ్చంద్రుడి భక్తుడ్ని. ఎలాంటి టైమ్లోనైనా హరిశ్చంద్రుడు నిజమే చెప్తాడు. నిజంగా నేను పూజించే ఏకైక భగవానుడు సత్య హరిశ్చంద్రుడు. అందుకని ఎప్పుడూ నేను నిజమే చెప్తా. అప్పుడు ఆ అమ్మాయిని బికినీలో చూడాలనిపించింది కాబట్టి, నేను ఆమెను బికినీలో చూడాలని ఉంది అని చెప్పకపోతే నేను పాపం చేసినట్టవుతుంది. నేను పాపం చేస్తే దేవుడు నన్ను క్షమించడు, నన్ను నరకానికి పంపిస్తాడు కాబట్టి అప్పుడు నేను నిజమే చెప్పాను" అని వివరించాడు వర్మ.
ఆయన దృష్టితో అడగడం ఆయన హక్కు, వద్దనడం అవతలి వాళ్ల హక్కు. అంతటితో ఆ విషయం అయిపోతుందనేది ఆయన వాదన. "నా పవిత్రమైన ఆలోచనని సోషల్ మీడియాలో పర్వర్ట్ చేశారు" అని వర్మ అన్నారు.
![]() |
![]() |