![]() |
![]() |

మెగాస్టార్ చిరంజీవి, సుహాసినిది హిట్ కాంబినేషన్. వెండితెరపై జంటగా ఎంతోమంది ప్రేక్షకుల మనసులను కట్టి పడేశారు. ఇప్పుడీ జంట బ్రదర్ అండ్ సిస్టర్‌గా ప్రేక్షకుల ముందుకొస్తుందా? ఏమో... వచ్చినా రావొచ్చని ఫిలింనగర్ వర్గాలు వ్యాఖ్యానిస్తున్నాయి. అసలు వివరాల్లోకి వెళితే...
మోహన్ లాల్ హీరోగా నటించిన మలయాళీ హిట్ సినిమా 'లూసిఫర్'ను తెలుగులో మెగాస్టార్ రీమేక్ చేస్తున్న సంగతి తెలిసిందే. 'రన్ రాజా రన్', 'సాహో' ఫేమ్ సుజీత్ తెలుగు తగ్గట్టు కథలో మార్పులు చేర్పులు చేస్తున్నారు. ప్రస్తుతం స్క్రిప్ట్ వర్క్ జరుగుతోంది. దాదాపుగా పూర్తయిందని సమాచారం. ఈ సినిమాలో ముఖ్యమంత్రి పెద్దగా కుమార్తెగా, హీరోకి వరసకు సిస్టర్ అయ్యే క్యారెక్టర్ ఒకటి ఉంది. ఆ పాత్రకు సుహాసిని అయితే బావుంటుందని ఆలోచిస్తున్నారని టాక్. ఇది నిజమైతే ఒకే సినిమాలో మరోసారి చిరంజీవి, సుహాసినిని చూడవచ్చు. కొరటాల శివ దర్శకత్వంలో చిరంజీవి నటిస్తున్న 'ఆచార్య'
![]() |
![]() |