![]() |
![]() |

యువ హీరో నితిన్ చేతిలో ప్రస్తుతం రెండు సినిమాలు ఉన్నాయి. వెంకీ అట్లూరి దర్శకత్వంలో నటిస్తున్న 'రంగ్ దే' ఒకటి, చంద్రశేఖర్ ఏలేటి దర్శకత్వంలో నటిస్తున్న 'చెక్' మరొకటి. ఈ రెండు కాకుండా 'అంధాధున్' రీమేక్ లైనులో పెట్టాడు. ఆ సినిమాలో నభా నటేష్ హీరోయిన్ అన్నది లేటెస్ట్ టాక్. హిందీలో టబు చేసిన కీలక పాత్రకు శిల్పా శెట్టి అయితే బావుంటుందని ఆలోచిస్తున్నారట. 'వెంకటాద్రి ఎక్స్‌ప్రెస్', 'ఎక్స్‌ప్రెస్ రాజా' సినిమాలు తీసిన మేర్లపాక గాంధీ ఈ చిత్రానికి దర్శకత్వం వహించనున్నారు.
నభా నటేష్... సుధీర్ బాబు హీరోగా నటించిన 'నన్ను దోచుకుందువటే'తో తెలుగు తెరకు పరిచయమైన కన్నడ కస్తూరి. తర్వాత రామ్ సరసన 'ఇస్మార్ట్ శంకర్'లో ఫుల్ పటాస్ తరహాలో పేలింది. రవితేజ 'డిస్కో రాజా'లో మెరిసింది. అందంతో పాటు అభినయంతోనూ ఆకట్టుకుంది. తెలుగులో యువ కథానాయకులకు సరైన జోడీ అనిపించుకుంది. దాంతో మంచి అవకాశాలు వస్తున్నాయి. ప్రస్తుతం సాయి తేజ్ సరసన 'సోలో బతుకే సో బెటర్', బెల్లంకొండ సాయి శ్రీనివాస్ సరసన 'అల్లుడు అదుర్స్' సినిమాలు చేస్తోంది.
![]() |
![]() |