![]() |
![]() |

సౌత్ లో అనతి కాలంలోనే స్టార్ డైరెక్టర్ గా ఎదిగాడు లోకేష్ కనగరాజ్. ఇక లోకేష్ సినిమాటిక్ యూనివర్స్ కి ఆడియన్స్ లో ఎంతటి క్రేజ్ ఉందో తెలిసిందే. అందునా 'ఖైదీ'లో కార్తి పోషించిన ఢిల్లీ పాత్రకి, 'విక్రమ్' క్లైమాక్స్ లో సూర్య సందడి చేసిన రోలెక్స్ పాత్రకి విపరీతమైన అభిమానులున్నారు. అలాంటిది ఈ ఇద్దరు తలబడితే ఎలా ఉంటుంది?. త్వరలోనే అది సాధ్యం కాబోతుంది.
లోకేష్ డైరెక్ట్ చేసిన లేటెస్ట్ మూవీ 'కూలీ' ఆగస్టు 14న థియేటర్లలో అడుగుపెట్టింది. డివైడ్ టాక్ తెచ్చుకున్నప్పటికీ మూడు రోజుల్లోనే ఈ చిత్రం రూ.300 కోట్లకు పైగా గ్రాస్ రాబట్టడం విశేషం. దీని తర్వాత 'ఖైదీ-2' చేయనున్నాడు లోకేష్. ఢిల్లీ వర్సెస్ రోలెక్స్ అన్నట్టుగా ఈ చిత్ర కథ ఉంటుందని తెలుస్తోంది.
నిజ జీవితంలో సూర్య, కార్తి అన్నదమ్ములు అనే విషయం తెలిసిందే. అలాంటిది ఈ ఇద్దరు స్క్రీన్ పై ఢీ అంటే ఢీ అన్నట్టుగా తలపెడితే ఏ రేంజ్ లో ఉంటుందో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. పైగా ఇప్పటికే రోలెక్స్ గా సూర్య, ఢిల్లీగా కార్తి ఎంతో ఇంపాక్ట్ క్రియేట్ చేశారు. మరి ఇద్దరి పోరులో ఎవరు పైచేయి సాధిస్తారో చూడాలి.
![]() |
![]() |