![]() |
![]() |

తెలుగు చిత్ర పరిశ్రమలో కొద్దిరోజులుగా సినీ కార్మికులు వర్సెస్ నిర్మాతలు అన్నట్టుగా పరిస్థితి నెలకొంది. వేతనాలు పెంచాలని డిమాండ్ చేస్తూ కార్మికులు సమ్మెకు దిగారు. అయితే నిర్మాతలు మాత్రం ఇప్పటికే వేతనాలు ఎక్కువగా ఉన్నాయని, ప్రస్తుతం సినీ పరిశ్రమ పరిస్థితి కూడా బాలేదని చెబుతున్నారు. ఈ క్రమంలో ఇరు వర్గాల మధ్య చర్చలు జరుగుతున్నాయి. త్వరలోనే సమస్య పరిష్కారమై, షూటింగ్ లు తిరిగి ప్రారంభం కావాలని అందరూ కోరుకుంటున్నారు. ఈ నేపథ్యంలోనే తాజాగా మెగాస్టార్ చిరంజీవితో ప్రముఖ నిర్మాత సి. కళ్యాణ్ సమావేశమయ్యారు.
సినీ కార్మికుల సమ్మెపై చిరంజీవిని కలసి చర్చించిన సి. కళ్యాణ్ అనంతరం మీడియాతో మాట్లాడుతూ.. "ఈరోజు చిరంజీవి గారిని కలవడం జరిగింది. ఆయన ఈ సమస్య సాల్వ్ అవ్వాలని ప్రతిరోజు మాతో ఫాలోప్ చేస్తూనే ఉన్నారు. చిరంజీవి గారు పెద్ద మనిషిగా.. ఇరు వర్గాలకు న్యాయం జరగాలనే ఉద్దేశంతో ఉన్నారు. తన వంతుగా కార్మికులతో మాట్లాడాతాను అన్నారు. రేపు ఫెడరేషన్ వారు చిరంజీవి గారిని కలవనున్నారు. సోమవారం లోగా సమస్యకు పరిష్కారం లభిస్తుందని ఆశిస్తున్నాను." అన్నారు.
"నిర్మాతలు కూడా చాలా ఇబ్బందుల్లో ఉన్నారు. ముఖ్యంగా చిన్న నిర్మాతలు బాగా సఫర్ అవుతున్నారు. ఛాంబర్ ప్రెసిడెంట్ భరత్ కూడా సమస్య పరిష్కారానికి కృషి చేస్తున్నారు. నాకున్న అనుభవంతో ప్రాక్టీకల్ గా ఉండే సమస్యలను వివరించాను. ఇతర రాష్ట్రాల కంటే టారీఫ్ ఎక్కువే గానే ఇక్కడ కార్మికులకు ఉంది. లేబర్ కమిషన్ రూల్స్ ప్రకారం సినిమాలకు పని చేయలేం. రూల్స్ ప్రకారం భోజనం పెట్టాల్సిన అవసరంలేదు. కానీ, ఖర్చులు భరిస్తూ కార్మికులకు భోజనాలు ఏర్పాటు చేస్తున్నాం. ఓ ఫ్యామిలీలా అందరం కలిసి వర్క్ చేసుకోవటం అలవాటు అయిపొయింది. త్వరలో ఇష్యూ సాల్వ్ అవుతుందని నమ్ముతున్నాను." అని సి. కళ్యాణ్ చెప్పారు.
![]() |
![]() |