![]() |
![]() |
నిహార్ కపూర్, నాగార్జున, సత్యకృష్ణ, ప్రధాన పాత్రల్లో రూపొందిన పాన్ ఇండియా మూవీ ‘రికార్డ్ బ్రేక్’. శ్రీతిరుమల తిరుపతి వెంకటేశ్వర ఫిలింస్ బ్యానర్‌పై చదలవాడ పద్మావతి నిర్మాతగా, చదలవాడ శ్రీనివాసరావు ఈ సినిమా తెరకెక్కింది. ఈ సినిమా ప్రీమియర్ షోలకు మంచి స్పందన లభించింది. మార్చి 8న ఈ చిత్రాన్ని విడుదల చేస్తున్నారు.
ఈ సందర్భంగా చదలవాడ శ్రీనివాసరావు మాట్లాడుతూ ‘ఐదు సంవత్సరాల నుంచి కష్టపడి తయారు చేసిన సినిమా ఇది. ఇది మంచి మెసేజ్ ఉన్న సినిమా. మార్నింగ్ షో ఓపెనింగ్స్ మంచిగా వస్తే ఈవినింగ్ కల్లా సినిమా కచ్చితంగా పుంజుకుంటుంది. మార్నింగ్ షోకి వచ్చి చూడండి సినిమా బాగోకపోతే ఎవరూ రావద్దు. బాగుంటే ఖచ్చితంగా సినిమాని సపోర్ట్ చేయాలని నా విన్నపం. ఒక గొప్ప చిత్రం తీసానని గర్వంగా చెప్పగలను. నా ఆర్టిస్టులు టెక్నీషియన్ టీం మ్యూజిక్ డైరెక్టర్ అందరూ కూడా చాలా కష్టపడి పనిచేశారు. అంగిరెడ్డి శ్రీనివాస్ అందించిన కథ డిఓపిగా కంతేటి శంకర్ పనితీరు చాలా బాగున్నాయి. ఈ సినిమాని ప్రేక్షకులు ఆదరించి మమ్మల్ని ఆశీర్వదించి పెద్ద సక్సెస్ చేయాలి మనస్పూర్తిగా కోరుకుంటున్నాను’ అన్నారు.
తెలుగు ఫిలిం ప్రొడ్యూసర్స్ కౌన్సిల్ సెక్రటరీ టి.ప్రసన్నకుమార్ గారు మాట్లాడుతూ ‘కరోనా కాలంలో పేస్టింగ్ బాయ్స్ దగ్గర నుంచి ఎగ్జిక్యూటివ్స్ దగ్గర నుంచి ప్రతి ఒక్కరికి కష్టంలో ఉన్న అందరిని ఆదుకున్న వ్యక్తి చదలవాడ శ్రీనివాసరావుగారు. మనం ఎదుటివారికి సేవ చేస్తే దేవుడు మనకు పదింతలు ఇస్తాడు అని నమ్మి ఉండే వ్యక్తి ఆయన. అలాంటి వ్యక్తి ఈ రోజున ఈ రికార్డు బ్రేక్ సినిమా చేశారు. ఇద్దరు అనాధలు వరల్డ్ రెజ్లింగ్ వరకు ఎలా వెళ్లారు అనే కాన్సెప్ట్ చాలా బాగా చిత్రీకరించారు. ప్రేక్షకుల సినిమాను చూసి సపోర్ట్ చేయాలని మనస్పూర్తిగా కోరుకుంటున్నాను’ అన్నారు.
నిహార్‌కపూర్ మాట్లాడుతూ ‘ఈ సినిమా కోసం మేం పడిన కష్టం షూటింగ్ పోస్ట్ ప్రొడక్షన్ విఎఫ్‌ఎక్స్ ఇవన్నీ స్క్రీన్ మీద చూస్తేనే మీకు తెలుస్తుంది. ఈ సినిమాలో దేశభక్తి, మదర్ సెంటిమెంట్, డివోషన్, రైతుల కష్టం ఇలాంటి ఎన్నో విషయాలు ఉన్నాయి. ప్రతి ఇండియన్ చూడాల్సిన సినిమాగా ఈ సినిమాని 8 భాషల్లో విడుదల చేస్తున్నాం’ అన్నారు.
ఆర్టిస్ట్ నాగార్జున మాట్లాడుతూ ‘ఈ సినిమా కోసం మేం చాలా కష్టపడ్డాం. ప్రేక్షకులు ఈ సినిమా చూసి సక్సెస్ చేస్తారని ఆశిస్తున్నాను’ అన్నారు.
![]() |
![]() |