![]() |
![]() |
.webp)
సూపర్ స్టార్ మహేష్ బాబు(Mahesh Babu)ప్రస్తుతం దర్శక ధీరుడు రాజమౌళి(ss rajamouli)సినిమాకి ప్రిపేర్ అవుతున్న విషయం తెలిసిందే.ఇటీవలే ఎలాంటి హడావిడి లేకుండా మూవీ ప్రారంభమయ్యింది.ssmb 29 గా తెరకెక్కుతున్న ఈ మూవీ కోసం ఇప్పటినుంచే మహేష్ అభిమానులతో పాటు ప్రేక్షకులు కూడా ఎంతగానో ఎదురుచూస్తున్నారని చెప్పడంలో ఎలాంటి అతిశయోక్తి లేదు.త్వరలోనే రెగ్యులర్ షూటింగ్ కి వెళ్ళబోతున్న ఈ మూవీ యాక్షన్ అడ్వెంచర్ డ్రామాగా తెరకెక్కబోతుంది.ఈ విషయాన్ని చాలా సందర్భాల్లో చిత్ర రచయిత విజయేంద్ర ప్రసాద్(Vijayendraprasad)వెల్లడి చెయ్యడం జరిగింది.
ఇక మహేష్ బాబు గత ఏడాది 'గుంటూరు కారం'(Guntur kaaram)సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చిన విషయం తెలిసిందే.సంక్రాంతికి కానుకగా వచ్చిన ఈ మూవీ మహేష్ రేంజ్ కి తగ్గ హిట్ ని అందుకోకపోయినా కూడా,మహేష్ అభిమానులని అయితే మాత్రం ఎంతగానో అలరించింది.ముఖ్యంగా సాంగ్స్ అయితే ఒక రేంజ్ లో ప్రేక్షకుల మనసులని కొల్లగొట్టాయని చెప్పుకోవచ్చు.ముఖ్యంగా కుర్చీమడత పెట్టి సాంగ్ అయితే వ్యూస్ పరంగా గాని రీల్స్ పరంగా గాని ఎన్నో రికార్డులని నమోదు చేసింది.లేటెస్ట్ గా ఇప్పుడు నేపాల్ లో కూడా ఈ సాంగ్ అదరగొడుతుంది.వందలాది మంది విద్యార్థులు,మహిళలు ఈ సాంగ్ కి డాన్స్ చేస్తున్న విజువల్స్ ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి.

'కుర్చీ మడతపెట్టి' సాంగ్ యూట్యూబ్ లో కూడా తెలుగు నుంచి 550 మిలియన్ వ్యూస్ అందుకున్న ఫాస్టెస్ట్ వీడియో సాంగ్ గా నిలిచింది. 3 మిలియన్ లైక్స్ ని కూడా అందుకోవడం విశేషం.
![]() |
![]() |