![]() |
![]() |

తెలుగు సినిమా పరిశ్రమలో మెగాస్టార్ చిరంజీవి(Chiranjeevi)పవర్ స్టార్ పవన్ కళ్యాణ్(Pawan Kalyan)లకి ఉన్న క్రేజ్ గురించి ప్రత్యేకంగా చెప్పుకోవాల్సిన పని లేదు.ఈ ఇద్దరి సినిమా రిలీజ్ అయ్యిందంటే చాలు థియేటర్స్ దగ్గర పండుగ వాతావరణం నెలకొని ఉంటుంది.తమ తమ సుదీర్ఘ సినీ ప్రస్థానంలో ఎన్నో సూపర్ హిట్ సినిమాల్లో నటిస్తు ఇండస్ట్రీ రికార్డులుని కూడా సృష్టించుకుంటు వస్తున్నారు.అభిమాన గణం కూడా చాలా ఎక్కువే.
ఈ రోజు ఆంధ్రప్రదేశ్ ఐటి శాఖ మంత్రి నారా లోకేష్(Nara Lokesh)పుట్టిన రోజు.ఈ సందర్భంగా చిరంజీవి 'ఎక్స్' వేదికగా ట్వీట్ చేస్తు ఆంధ్రప్రదేశ్ అభివృద్ధి తో పాటు తెలుగు ప్రజలకి సేవ చెయ్యాలనే మీ తపన ఎంతో హర్షణీయం.మీ ప్రయత్నాలన్నీ విజయం సాధించాలని కోరుకుంటున్నాను.పుట్టిన రోజు శుభాకాంక్షలు డియర్ లోకేష్ అని ట్వీట్ చెయ్యడం జరిగింది.
.webp)
ఇక పవన్ కళ్యాణ్ కూడా ఎక్స్ వేదికగా స్పందిస్తు సోదర సమానులైన నారా లోకేష్ కి జన్మ దిన శుభాకాంక్షలు.మీరు ఎల్లప్పుడూ సుఖ సంతోషాలతో ఉంటూ ప్రజలకి మరింత సేవ చెయ్యాలని కోరుకుంటున్నానంటూ ట్వీట్ చేసాడు.
![]() |
![]() |