Home  »  News  »  ఓటిటిలోకి శ్రీనివాస మంగాపురం 

Updated : Aug 19, 2026


ఘట్టమనేని థర్డ్ జనరేషన్ వారసుడు జయకృష్ణ, రషా తడాని, మోహన్ బాబు, అజయ్  భూపతి కాంబోలో తెరకెక్కిన 'శ్రీనివాస మంగాపురం’ గత నెల 30 న ప్రేక్షకుల ముందుకు వచ్చిన విషయం తెలిసిందే. జయకృష్ణ తో పాటు రషా పెర్ఫార్మెన్స్ కి మంచి పేరే వచ్చింది. కానీ మూవీ మాత్రం ప్రేక్షకుల వద్దకి చేరలేదనే టాక్ అయితే సినీ సర్కిల్స్ లో వినిపిస్తుంది. ఇప్పుడు ఈ మూవీ డిజిటల్ ప్రీమియర్‌కు సిద్ధమైంది.

ప్రముఖ ఓటీటీ వేదిక అమెజాన్ ప్రైమ్ వీడియోలో ఆగస్టు 20 నుంచి తెలుగుతో పాటు తమిళం, హిందీ, మలయాళం, కన్నడ భాషల్లో అందుబాటులోకి తీసుకువస్తున్నారు. మరి థియేటర్స్ లో ఆకట్టుకోలేని శ్రీనివాస మంగాపురం ఓటిటిలో అయినా తన సత్తా చాటుతుందేమో చూద్దాం. ప్రాణానికి ప్రాణంగా ప్రేమించిన అమ్మాయి గతం మర్చిపోతే ఆ గతాన్ని గుర్తు చేస్తే తన హెల్త్ కి ప్రాబ్లెమ్ అని, గతం గుర్తు చేయకుండా తిరిగి మళ్ళీ తన ప్రియురాల్ని ప్రేమలోకి దించి తన దాన్ని చేసుకునే హీరో కథనే శ్రీనివాస మంగాపురం.  యాక్షన్ జోన్ లో లవ్ పాయింట్ ని ముస్తాబు చేసారు. వైజయంతి మూవీస్, ఆనంది ఆర్ట్స్ సమర్పణలో  అశ్వినీదత్, జెమిని కిరణ్ నిర్మించారు.


Also Read: తీవ్ర అనారోగ్యంతో రామ్ పోతినేని లేడీ ఫ్యాన్.. రామ్ నిర్ణయంపై ప్రశంసలు 
 

Jaya krishna, Rasha Thadani, Mohan Babu


 






Disclaimer:
All content included on this TeluguOne.com Portal including text, graphics, images, videos and audio clips, is the property of ObjectOne Information Systems Ltd. or our associates, and protected by copyright laws. The collection, arrangement and assembly of all content on this portal/ related channels is the exclusive property of ObjectOne Information Systems Ltd. or our associates and protected copyright laws.
You may not copy, reproduce, distribute, publish, display, perform, modify, create derivative works, transmit, or in any other way exploit any part of copyrighted material without permission from ObjectOne Information Systems Ltd or our associates.