![]() |
![]() |

మెగాస్టార్ చిరంజీవి, శృతి హాసన్ జంటగా నటిస్తున్న చిత్రం 'వాల్తేరు వీరయ్య'. బాబీ కొల్లి దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రానికి దేవిశ్రీ ప్రసాద్ సంగీత దర్శకుడు. ఈ సినిమా నుంచి ఇప్పటికే విడుదలైన 'బాస్ పార్టీ' సాంగ్ మెగా ఫ్యాన్స్ ని విశేషంగా ఆకట్టుకుంది. ఇక ఇప్పుడు ఈ చిత్రం నుంచి రెండో సాంగ్ విడుదలైంది.
'వాల్తేరు వీరయ్య' నుంచి 'శ్రీదేవి చిరంజీవి' అనే పాటను తాజాగా విడుదల చేశారు. కూల్ గా సాగుతున్న ఈ మెలోడీ సాంగ్ ఆకట్టుకుంటోంది. ఈ సాంగ్ కి లిరిక్స్ కూడా దేవిశ్రీ అందించడం విశేషం. "నువ్వు సీతవైతే.. నేను రాముడి నంట. నువ్వు రాధవైతే.. నేను కృష్ణుడి నంట" అంటూ సాగిన లిరిక్స్ క్యాచీగా ఉన్నాయి. జస్ప్రీత్, సమీరా ఆలపించిన ఈ సాంగ్ కి శేఖర్ మాస్టర్ కొరియోగ్రఫీ అందించాడు. ఫ్రాన్స్ లో బ్యూటిఫుల్ లొకేషన్స్ లో చిత్రీకరించిన ఈ మెలోడీ సాంగ్ కి ఆయన కంపోజ్ చేసిన క్యూట్ స్టెప్స్ అట్రాక్టివ్ గా ఉన్నాయి. మెగాస్టార్ తన గ్రేస్ తో మరోసారి మ్యాజిక్ చేశాడు. ఇక చీరకట్టులో శృతి ఎంతో అందంగా ఉంది.
మైత్రి మూవీ మేకర్స్ నిర్మిస్తున్న ఈ చిత్రంలో మాస్ మహారాజా రవితేజ కీలక పాత్రలో అలరించనున్నాడు. ఈ చిత్రం సంక్రాంతి కానుకగా 2023, జనవరి 13న విడుదల కానుంది.
![]() |
![]() |