![]() |
![]() |

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ కెరీర్ లో 'ఖుషి' చిత్రానికి ప్రత్యేక స్థానముంటుంది. ఎస్.జె. సూర్య దర్శకత్వం వహించిన ఈ చిత్రం 2001లో విడుదలై సంచలన విజయాన్ని అందుకుంది. ఈ సినిమా వచ్చి 20 ఏళ్ళు దాటినా ఇప్పటికీ ఇందులోని డైలాగ్స్, సీన్స్, సాంగ్స్ అలరిస్తుంటాయి. ముఖ్యంగా పవన్ స్క్రీన్ ప్రజెన్స్, మ్యానరిజమ్స్ ఈ చిత్రానికి ప్రత్యేక ఆకర్షణగా నిలిచాయి. అంతలా ఆకట్టుకున్న ఈ చిత్రం మళ్ళీ థియేటర్స్ లో ప్రేక్షకులను అలరించడానికి సిద్ధమవుతోంది.
ప్రస్తుతం రీరిలీజ్ ల ట్రెండ్ నడుస్తోంది. ఇటీవల 'జల్సా' చిత్రాన్ని రీరిలీజ్ చేయగా రికార్డు కలెక్షన్స్ తో సత్తా చాటింది. అప్పటి నుంచే పవన్ ఫ్యాన్స్ 'ఖుషి' సినిమాని కూడా మళ్ళీ విడుదల చేయాలని డిమాండ్ చేస్తున్నారు. ఎట్టకేలకు వారి ఆశ నెరవేరనుంది. డిసెంబర్ 31న 'ఖుషి' చిత్రాన్ని రీరిలీజ్ చేయబోతున్నట్లు తాజాగా ప్రకటించింది. దీంతో పవన్ ఫ్యాన్స్ ఫుల్ ఖుషి అవుతున్నారు. అప్పుడే ట్విట్టర్ లో 'ఖుషి' హాష్ ట్యాగ్ ని ట్రెండ్ కూడా చేస్తున్నారు.
ఏ.ఎం.రత్నం నిర్మించిన ఈ చిత్రంలో భూమిక హీరోయిన్ గా నటించింది. మణి శర్మ ఈ చిత్రానికి సంగీతం అందించాడు. 'అమ్మాయే సన్నగా', 'యే మేరా జహాన్', 'ఆడువారి మాటలకు' ఇలా చిత్రంలోని పాటలన్నీ విశేష ఆదరణ పొందాయి.
![]() |
![]() |