![]() |
![]() |

షాక్ లో సినీ పెద్దలు
మరణానికి కారణం ఏంటి
ఎన్ని సినిమాలు చేసారు
రచయితగా, దర్శకుడుగా, నటుడుగా,డబ్బింగ్ ఆర్టిస్ట్ గా, నిర్మాతగా తనదైన శైలిలో రాణించారు శ్రీనివాసన్. మలయాళ చిత్ర పరిశ్రమకి చెందిన శ్రీనివాసన్(Sreenivasan)ఆయా రంగాల ద్వారా ఎంతో మంది అభిమానుల్ని కూడా సంపాదించి మలయాళ చిత్ర సీమలో చాలా ప్రభావంతమైన సినీ పర్సనాలిటీ గా కీర్తింపబడ్డాడు. అగ్ర నటులైన మోహన్ లాల్, మమ్ముట్టి నుంచి వచ్చిన చాలా చిత్రాల్లో స్క్రీన్ షేర్ చేసుకుని ఆ ఇద్దరికి ధీటైన పెర్ ఫార్మెన్స్ ని ప్రదర్శించి మెస్మరైజ్ చేసాడు. శ్రీనివాసన్ కొంత కాలం నుంచి అనారోగ్యంతో బాధపడుతున్నారు. దీంతో కొచ్చి లోని ఒక ప్రైవేట్ హాస్పిటల్ లో ట్రీట్ మెంట్ తీసుకుంటున్నారు. చివరకి పరిస్థితి విషమించడంతో ఈ రోజు ఉదయం తుది శ్వాస విడిచారు.
1956 వ సంవత్సరంలో కన్నూరు జిల్లాలోని పట్టియోమ్ లో జన్మించిన శ్రీనివాసన్ 1976 వచ్చిన 'మణిముజుక్కం' అనే మూవీతో నటుడుగా ఎంట్రీ ఇచ్చాడు. ఆ తర్వాత స్నేహ యమున, ఓదరుతమ్మవా అలరియం , సన్మనస్సుల్లవర్క్కు సమాధానం, గాంధీనగర్ 2వ వీధి, నాడోడికట్టు , పట్టనప్రవేశం, వరవేల్పు, తాళయాన మంత్రం, సందేస్. మజాయేతుమ్ మున్పే , అజకియా రావణన్ ,ఒరు మరవత్తూర్ కనవు , ఉదయనను తరం, కథా పరయుంపోల్, నాన్ ప్రకాశన్ వంటి పలు చిత్రాలు ఆయన నుంచి వచ్చాయి.ఉత్తమ స్క్రీన్ ప్లే క్యాటగిరిలో ఆరు కేరళ రాష్ట్ర చలనచిత్ర అవార్డులుతో పాటు జాతీయ చలనచిత్ర అవార్డు , రెండు ఫిల్మ్‌ఫేర్ అవార్డులు సౌత్ మరియు కూడా అందుకున్నాడు . వడక్కునోకియంత్రం,చింతవిష్టాయ శ్యామల అనే చిత్రాలకి దర్శకత్వం వహించాడు.
also read: ధురంధర్ పై వర్మ కీలక వ్యాఖ్యలు.. చిన్న సూట్ కేసుతో ముంబై వెళ్ళింది ఎవరు!
మోహన్ లాల్, మమ్మూటీ తో సహా మలయాళ చిత్ర సీమ యావత్తు శ్రీనివాసన్ మృతి పట్ల తమ సంతాపాన్ని తెలియచేసింది.శ్రీనివాసన్ కుమారుడు ధ్యాన్ శ్రీనివాసన్ మలయాళ రంగంలో హీరోగా తన సత్తా చాటుతూ వస్తున్నాడు. శ్రీనివాసన్ ఈ ఏడాది ఫిబ్రవరి లో ధ్యాన్ శ్రీనివాసన్ హీరోగానే వచ్చిన 'ఆప్ కైసోహో' అనే చిత్రంలో ముఖ్య పాత్ర పోషించి మెప్పించాడు. చివరిగా నాన్సీ రాణి లో కనిపించాడు. సుమారు 220 చిత్రాలు ఆయన ఖాతాలో ఉన్నాయి.
![]() |
![]() |