![]() |
![]() |
![]()
సినిమా పేరు: అవతార్ ఫైర్ అండ్ యాష్
తారాగణం: సామ్ వర్తింగ్టన్, జియో సాల్డానా, స్టీఫెన్ లాంగ్, కేట్ విన్స్ లేట్ తదితరులు తదితరులు
ఎడిటర్: డేవిడ్ బ్రేన్నర్, జాన్
మ్యూజిక్:సైమన్ ఫ్రాంగ్లన్
రచన, దర్శకత్వం: జేమ్స్ కామెరూన్
సినిమాటోగ్రాఫర్: రసల్ కార్పెంటర్
బ్యానర్: లైట్ స్తోమ్ ఎంటర్ టైన్ మెంట్
నిర్మాతలు:జేమ్స్ కామెరూన్, జోన్ లండు
విడుదల తేదీ: డిసెంబర్ 19, 2025
ప్రపంచ సినీ ప్రేమికులతో పోటీపడుతు తెలుగు సినిమా ప్రేమికులు ఎంతగానో ఎదురుచూస్తున్న మూవీ 'అవతార్ ఫైర్ అండ్ యాష్'(Avatar fire and ash). దీంతో పండోర గ్రహంలో మరోసారి ప్రపంచ సినీ పితామహుడుగా పిలవబడే జేమ్స్ కామెరూన్(James Cameron)సృషించిన అద్భుతమైన విశ్వాన్ని చూడటానికి ఉదయం నుంచే థియేటర్స్ కి క్యూ కట్టారు.మరి మూవీ మెప్పించిందా లేదా చూద్దాం.
కథ
పోరాటయోధుడైన జేక్ (సామ్ వర్తింగ్టన్) తన కుటుంబం, తన మనుషులతో పండోర గ్రహంలో నివసిస్తూ ఉంటాడు. వాళ్ళందరంటే జేక్ కి ప్రాణం. జేక్ బార్య నైత్రీ కూడా పోరాటయోధురాలు. ఏలియన్స్ అయిన వీళ్ళతో పాటు స్పైడర్ అనే మాములు మనిషి జీవిస్తుంటాడు. జేక్ ఫ్యామిలీకి స్పైడర్ అంటే ఎంతో ఇష్టం. వీళ్ళకి దూరంగా ఒక రహస్య ప్రాంతంలో కల్నల్ క్వారీచ్(స్టీఫెన్ లాంగ్) నేతృత్వంలోని ఆర్ డి ఏ టీం, బ్రిడ్జి హెడ్ అనే ప్రాజెక్ట్ ని స్టార్ట్ చేస్తుంది. మాములు మనుషులైన వాళ్ళ లక్ష్యం జేక్ ని తమ అదుపులో ఉంచుకోవడం. మరో వైపు యాష్ పీపుల్' నాయకురాలు, ఏలియన్ అయిన వరాంగ్(ఊనా చప్లీన్) లక్ష్యం జేక్ ని అంతం చేయడం. ఈ క్రమంలో స్పైడర్ ని అతని శరీరంలో ఉన్న 'అల్గే' కోసం కల్నల్ మనుషులు తీసుకెళ్తారు. అసలు అల్గే అంటే ఏంటి? జేక్ పై కల్నల్ క్వారీచ్, వరాంగ్ కి పగ ఎందుకు? జేక్ అతని తెగపై ఏం ఆశించి పోరాటం చేస్తున్నారు? ఆ పోరాటంలో క్వారీచ్, వరాంగ్ ఒక్కటయ్యారా! ఒక్కటయ్యితే ఆ పోరాటాన్ని జేక్ వర్గం ఎలా ఎదుర్కొంది. ఆ పోరాటంలో ఎవరు విజేతలుగా నిలిచారు ? అసలు టోటల్ గా అవతార్ ఫైర్ అండ్ యాష్ ఏ ఉద్దేశంతో తెరకెక్కిందనేదే చిత్ర కథ.
ఎనాలసిస్
అవతార్ రెండు పార్టులు చూసిన వాళ్లకి పార్ట్ 3 ఈజీగా అర్ధమవుతుంది. కొత్త వాళ్ళు అయితే అంత త్వరగా అర్ధం చేసుకోలేరు. ఈ విషయాన్నీ మేకర్స్ గుర్తించి రెండు భాగాల కథని మొదట ఐదు నిమిషాల్లో చెప్పాల్సింది. ఫైర్ అండ్ యాష్ ని చూసుకుంటే స్టార్టింగ్ నుంచే స్లో గా కథనం నడవడంతో పాటు క్యారక్టర్ ల బాడీ లాంగ్వేజ్ కూడా చివరి దాకా అదే విధంగా నడిచాయి. విజువల్స్ పరంగా బాగున్నా ఒకే పాయింట్ పై కథ నడవడంతో చూసిన సీన్స్ మళ్ళీ చూసినట్టుగా అనిపించడం మైనస్. ప్రేక్షకులని మెప్పించాలనే రీతిలో మేకర్స్ తెరకెక్కించలేదని స్టార్టింగ్ నుంచే అనిపిస్తుంది. అసలు తమకి ముప్పు ఉంటుందని జేక్ అండ్ వర్గానికి తెలుసు కాబట్టి వాళ్ళ పోరాటాన్ని ఎంటర్ టైన్ మెంట్ కోణంలోనే ఎదుర్కొని ఉంటే బాగుండేదేమో.
ఫస్ట్ హాఫ్ చూసుకుంటే మొదటి ఇరవై నిమిషాల దాకా ఆకట్టుకునే సీన్స్ రాలేదు. ఆ తర్వాత వచ్చిన సీన్స్ లో భావోద్వేగాలు మాత్రం బాగున్నాయి. సినిమా చివరి దాకా అదే విధంగా భావోద్వేగాలు కంటిన్యూ అవుతూ వస్తుంటాయి. ఇంటర్వెల్ ట్విస్ట్ లో కూడా పెద్దగా మెరుపులు ఏమి లేవు. ఇక సెకండ్ హాఫ్ కూడా ఫస్ట్ హాఫ్ చూసినట్టుగానే ఉంది. ఒక సెంటిమెంట్ సీన్, ఆ తర్వాత యాక్షన్ ఎపిసోడ్స్ రాయడంతో మైమరిచిపోయిందేమి లేదు. విలన్స్ ఎంతో కష్టపడి పట్టుకున్న వ్యక్తి చాలా నాచురల్ గా తప్పించుకోవడం, మళ్ళీ అతనితో పోరాటం చేయడం అనేది ఇబ్బందిగా అనిపిస్తుంది. దీంతో గూస్ బంప్స్ రావు. కాకపోతే చివర్లో సముద్రంలో వచ్చిన పోరాట సన్నివేశాలతో పాటు సదరు సన్నివేశాల్లో విజువల్స్ మాత్రం సూపర్ గా ఉన్నాయి.
నటీనటులు సాంకేతిక నిపుణుల పని తీరు
అందరూ తమ క్యారక్టర్ ల పరిధి మేరకు సూపర్ గా చేసారు.టెక్నీకల్ గా చూసుకుంటే విజువల్స్, ఫొటోగ్రఫీ చాలా బాగుంది. ఆర్ ఆర్ స్కోర్ మాత్రం మెస్మరైజ్ చేసేంత స్థాయిలో లేదు. కథకి తగ్గట్టుగానే జేమ్స్ కామెరూన్ దర్శకత్వం సాగినా, కథనాన్ని చెప్పే విషయంలో మెప్పించలేకపోయాడు. ఎడిటింగ్ కూడా అంత క్యాచీగా లేదు.
ఫైనల్ గా చెప్పాలంటే క్యారక్టర్ డిజైన్స్ బాగున్నా వాటిని ఉపయోగించుకోవడంలో మేకర్స్ మెతక వైఖరి అవలంభించారు. ప్రస్తుత ట్రెండ్ కి తగ్గట్టుగా కాన్సెప్ట్ కి తగ్గ స్పీడ్ కూడా మూవీలో లేదు. విజువల్ గా మాత్రం బాగుంది.
రేటింగ్ 2 .5 /5
అరుణాచలం
![]() |
![]() |