![]() |
![]() |

మెగాస్టార్ చిరంజీవి రెండో కుమార్తె శ్రీజను 2007లో వివాదాస్పద రీతిలో ఆర్య సమాజంలో పెళ్ళి చేసుకున్న శిరీష్ భరద్వాజ్ తీవ్ర అనారోగ్యంతో మరణించినట్టు వార్తలు వస్తున్నాయి. లంగ్స్ డ్యామేజ్ అవ్వడంతో హైదరాబాద్ లో గచ్చిబౌలిలోని ఏఐజీ హాస్పిటల్ లో చికిత్స పొందుతూ శిరీష్ మృతి చెందినట్లు తెలుస్తోంది.
అప్పట్లో శ్రీజ, శిరీష్ భరద్వాజ్ పెళ్ళి దేశ వ్యాప్తంగా సంచలనం సృష్టించింది. వీరికి ఒక కుమార్తె కలిగిన తర్వాత, వీరిద్దరూ విడిపోయారు. శ్రీజ మళ్ళీ మరొకరిని వివాహం చేసుకోగా, శిరీష్ భరద్వాజ్ కూడా మరో పెళ్ళి చేసుకున్నారు. అయితే ఊహించని విధంగా ఇప్పుడాయన అనారోగ్యంతో మరణించారన్న వార్త సంచలనంగా మారింది.
![]() |
![]() |