Home  »  News  »  Swagatha Krishnan: ఆ మ్యూజిక్  డైరెక్టర్ నాపై లైంగిక దాడి చేసాడు.. ప్రముఖ సింగర్  సంచలన కామెంట్స్

Updated : Apr 29, 2026

 

 

సింగర్  స్వాగత కృష్ణన్(Swagatha Krishnan)..తమిళ సినీ రంగంలో ఎన్నో అద్భుతమైన పాటలు ఆమె గళం నుంచి వచ్చాయి. ఎంతో భవిష్యత్తు ఉందనుకుంటున్న తరుణంలో హఠాత్తుగా సినీ రంగాన్ని వదిలి రిషికేష్ వెళ్లి వ్యాపార రంగంలో స్థిరపడింది. అందుకు కారణం ఒక సంగీత దర్శకుడు నాపై చేసిన లైంగిక దాడి కారణమని చెప్తుంది. ఇప్పుడు ఈ విషయం సౌత్ సినీ సర్కిల్స్ లో వైరల్ గా మారింది. ఆ డీటెయిల్స్ ఏంటో చూద్దాం.

రీసెంట్ గా ఒక ఇంటర్వ్యూ లో స్వాగత కృష్ణన్ మాట్లాడుతు అప్పుడు నాది చిన్న వయసు. బ్రేక్ అప్ అయ్యి డిప్రెషన్ లో ఉన్న సమయంలో ఒక సంగీత దర్శకుడు నా లైఫ్ లోకి వచ్చాడు. నా పరిస్థితిని అనుకూలంగా చేసుకుని మాయమాటలు చెప్పి గురువుగా నటిస్తూ దగ్గరయ్యాడు. నా చేత పాటలు పాడించి రెమ్యునరేషన్ ఇవ్వలేదు.  పైగా  నా దగ్గరే భారీ మొత్తంలో డబ్బులు అప్పుగా తీసుకొని ఎగ్గొట్టాడు. స్టూడియోలో నాపై   బలవంతంగా లైంగిక దాడి చేసి అదంతా రికార్డు  చేసి నన్ను బెదరించాడు. ఆ తర్వాత నాపై దొంగతనం మోపడంతో పాటు లేనిపోనీ వదంతులు సృష్టించడంతో  మనోవేదన చెంది ఇండస్ట్రీ వదిలి వెళ్లానని చెప్పుకొచ్చింది. 


Also read: Gayatri Gupta: శివాజీకి గాయత్రి గుప్తా సావేజ్ రిప్లై.. నీతులు చెప్పడం ఆపండి

ఇంత కాలం ఈ విషయాన్ని ఎందుకు దాచారన్న ప్రశ్నకి స్పందిస్తు ఆ సమయంలో నాకు ధైర్యం సరిపోలేదు. సినీ పరిశ్రమలో ఎవరికి చెప్పాలో, ఎలా ఎదుర్కోవాలో తెలియలేదు. కానీ ఇటీవల ఒక యువతీని కూడా నాలాగే మోసం చేసాడు. ఆ అమ్మాయి నాతో ఆ బాధ చెప్పుకుంది. మరి కొంత మంది అమ్మాయిలు అతని మోసానికి గురయ్యారు. దీంతో మరెవరకి అన్యాయం జరగకూడదని న్యాయపరంగా ముందుకెళ్లాలని నిర్ణయించుకున్నట్టుగా చెప్పింది. యెనో పెన్నే , కాదల్ కన్మణి లాంటి పాటలు స్వాగత కృష్ణన్ కి మంచి పేరు తీసుకొచ్చాయి. సంగీత దర్శకుడి పేరుని మాత్రం ఆమె వెల్లడి చెయ్యలేదు. 

 

 






Disclaimer:
All content included on this TeluguOne.com Portal including text, graphics, images, videos and audio clips, is the property of ObjectOne Information Systems Ltd. or our associates, and protected by copyright laws. The collection, arrangement and assembly of all content on this portal/ related channels is the exclusive property of ObjectOne Information Systems Ltd. or our associates and protected copyright laws.
You may not copy, reproduce, distribute, publish, display, perform, modify, create derivative works, transmit, or in any other way exploit any part of copyrighted material without permission from ObjectOne Information Systems Ltd or our associates.