![]() |
![]() |

డీజే టిల్లు, టిల్లు స్క్వేర్ సినిమాలతో యూత్ లో మంచి ఫాలోయింగ్ ని సొంతం చేసుకున్న సిద్ధు జొన్నలగడ్డ (Siddhu Jonnalagadda) నుంచి వస్తున్న మూవీ 'జాక్'. బొమ్మరిల్లు భాస్కర్ దర్శకత్వంలో SVCC బ్యానర్ నిర్మిస్తున్న ఈ సినిమాలో వైష్ణవి చైతన్య హీరోయిన్. ప్రకాష్ రాజ్ కీలక పాత్ర పోషిస్తున్నారు. జాక్ మూవీ ఏప్రిల్ 10న ప్రేక్షకుల ముందుకు రానుంది. తాజాగా ఈ చిత్ర ట్రైలర్ విడుదలైంది. (Jack Trailer)
క్రైమ్ కామెడీ జానర్ లో తెరకెక్కిన తన గత రెండు సినిమాలతో టిల్లుగా ఎంతగానో నవ్వించిన సిద్ధు.. 'జాక్' తో స్పై యాక్షన్ కామెడీ జానర్ కి షిఫ్ట్ అయ్యాడు. అయితే ఇందులోనూ తన మార్క్ కామెడీ డైలాగ్ లు ఉండేలా చూసుకున్నాడు. స్పైగా సీరియస్ ఆపరేషన్ లో ఉండి కూడా, తన మాటలతో నవ్వించే ప్రయత్నం చేశాడు. ఇక దర్శకుడు బొమ్మరిల్లు భాస్కర్ కూడా రొమాంటిక్ కామెడీ సినిమాలకు పెట్టింది పేరు. అలాంటి భాస్కర్ స్పై జానర్ లోనూ తన ప్రతిభను చాటుకున్నాడని ట్రైలర్ తో అర్థమవుతోంది. ట్రైలర్ లో యాక్షన్ ఎలిమెంట్స్ ఆకట్టుకున్నాయి. అయితే ఈమధ్య ప్రచార చిత్రాల్లో హీరోల చేత బూతు డైలాగ్ లు చెప్పించడం ట్రెండ్ అయిపోయింది. ఆ ట్రెండ్ ని ఫాలో అవుతూ జాక్ ట్రైలర్ లో కూడా సిద్ధుతో బూతు సంభాషణలు పలికించారు.
![]() |
![]() |