![]() |
![]() |

ఆంధ్రప్రదేశ్ ఉపముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్(Pawan Kalyan)ప్రముఖ సినీనటుడు ప్రకాష్ రాజ్(Prakash raj)కి ఉన్న క్రేజ్ గురించి తెలిసిందే.కలియుగదైవంశ్రీ ఏడుకొండలవాడి దివ్యప్రసాదమైన తిరుపతి లడ్డు గత వైసిపీ ప్రభుత్వ హయాంలో కల్తీ జరిగిందనే ఆరోపణలు వచ్చినపుడు జరిగిన దోషానికి ప్రాయశ్చిత్తంగా పవన్ సనాతన దర్మం దీక్ష చేయడంతో పాటు,లడ్డు కల్తీ విషయంలో తన అభిప్రాయాన్ని చెప్పాడు.దీంతో పవన్ ని ఉద్దేశిస్తు ప్రకాష్ రాజ్ విమర్శలు చెయ్యడం,పవన్ కూడా అదే రీతిలో సమాధానం ఇవ్వడం జరిగింది.రీసెంట్ గా ప్రకాష్ రాజ్ ఒక ఇంటర్వ్యూలో జాతీయ అవార్డులు,రాజకీయాలపై తన అభిప్రాయూలని పంచుకున్నాడు.
ప్రకాష్ రాజ్ మాట్లాడుతు పవన్ కళ్యాణ్ రాజకీయాల్లోకి అడుగుపెట్టినప్పుడు ప్రజా సమస్యలపై మాట్లాడారు.అధికారంలోకి వచ్చాక ప్రజా సమస్యలని పట్టించుకోకుండా సమయం వృధా చేస్తున్నారు.నేను సనాతన ధర్మానికి వ్యతిరేకం కాదు.తిరుపతి లడ్డు విషయం చాలా సున్నితమైన అంశం.భక్తుల మనోభావాలకి సంబంధించింది కాబట్టి చాలా జాగ్రత్తగా వ్యవహరించాలి.లడ్డు తయారిలో నిజంగానే కల్తీ జరిగితే దోషులని వెంటనే శిక్షించాలని చెప్పుకొచ్చాడు.
పవన్, ప్రకాష్ కలిసి పలు చిత్రాల్లో నటించారు.బద్రి మూవీ ఈ ఇద్దరి కాంబోకి ప్రత్యేకమైన క్రేజ్ తెచ్చింది,చివరిగా ఈ ఇద్దరు వకీల్ సాబ్ లో నటించగా పవన్ అప్ కమింగ్ మూవీ 'ఓజి'(Og)లో కూడా ప్రకాష్ రాజ్ కీలక పాత్ర పోషిస్తున్నాడు.
.webp)
![]() |
![]() |