![]() |
![]() |

వెబ్ సిరీస్ : నయనం
నటీనటులు: వరుణ్ సందేశ్, ప్రియాంక జైన్, అలీ రజా, ఉత్తేజ్, రేఖా నిరోషా, హరీష్ తదితరులు
ఎడిటింగ్: వెంకట క్రిష్ణ చిక్కల
సినిమాటోగ్రఫీ: షోయబ్ సిద్దిఖి
మ్యూజిక్: అజయ్ అరసాడ
దర్శకత్వం: స్వాతి ప్రకాష్
ఓటీటీ : జీ5
కథ :
నయన్ అర్థరాత్రి తన హాస్పిటల్ లోపలికి వెళ్ళి అన్నీ వెతుకుతుంటాడు. ఇంతలో ఎవరో ఒకరు తన తలపై రాడ్ తో కొడతారు. అతను పడిపోవడంతో కథ అతని గతంలోకి వెళ్తుంది. నయన్ ఓ కంటి వైద్యడు. అతడికి చిన్నతనం నుండి అవతలి వాళ్ళ లైఫ్ లో ఏం జరుగుతుందో తెలుసుకోవాలనే కుతూహలం ఉంటుంది. అందుకే ప్రతీ నెలా అతను ఉండే వాచ్ మెన్ అంకుల్ కి డబ్బులు ఇచ్చి మరీ అపార్ట్మెంట్ లో జరిగే గొడవలు తెలుసుకుంటాడు. అయితే అతడి హాస్పిటల్ లో ఒక సీక్రెట్ రూమ్ ఉంటుంది. దాని తాళం(కీ) అందులో పనిచేసే ఎవరికి ఇవ్వడు. అయితే నయన్ కంటి వైద్యుడు కాబట్టి సీక్రెట్ గా ఓ ప్రయోగం చేస్తుంటాడు. తన దగ్గరికి వచ్చిన పేషెంట్స్ కి కంటిలోకి ఓ ఇంజక్షన్ ఇస్తుంటాడు. దానివల్ల అవతలి వాళ్లు చూసేది అతను చూడగలుగుతాడు. అలా ఒకరోజు మాధవి(ప్రియాంక జైన్) తన భర్త గౌరీ శంకర్(ఉత్తేజ్) ని చంపడం నయన్ చూస్తాడు. దాంతో నయన్ ఒక్కసారిగా ఉలిక్కిపడతాడు. ఆ తర్వాత నయన్ లైఫ్ ఎలా మారింది. అసలు మాధవి ఎందుకు తన భర్తని చంపాలనుకుందనేది తెలియాలంటే ఈ సిరీస్ చూడాల్సిందే.
విశ్లేషణ:
హీరో తలపై గుర్తుతెలియని వ్యక్తి తలపై కొట్టడంతో కథ ఆసక్తిగా మొదలైంది. నయన్ ఓ ప్రయోగం చేస్తుండటం.. అదే సమయంలో మాధవి తన భర్తని చంపడం..కేస్ ఇన్వెస్టిగేషన్ మరోవైపు ఇలా మూడు సాగుతుంటాయి. ప్రతీ ఎపిసోడ్ కి ఒక్కో ట్విస్ట్ తో ముందుకు సాగుతుంది.
ఈ సిరీస్ మొత్తంగా ఆరు ఎపిసోడ్ లు.. ఇందులో మొదటిది: ది ఐ హి బియోండ్(The Eye Beyond).. ఇందులో హీరో, హీరోయిన్ పరిచయం.. అలాగే హీరో హాస్పిటల్ స్టాఫ్ ని డీటేయిలింగ్ గా పరిచయం చేశాడు. ఇంకా రెండో ఎపిసోడ్: థ్రూ హార్ ఐస్(Through Her Eyes).. డాక్టర్ దగ్గరికి మాధవి రావడం.. తన భర్తకి కొత్త అద్దాలు ఇవ్వడం. అక్కడి నుండి ప్రతీరోజు తనని గమనించడం సాగుతుంది. ఇలా నయన్ ట్రీట్మెంట్ ఇచ్చిన ప్రతీ ఒక్కరి లైఫ్ లో ఏం జరుగుతుందో చూస్తుంటాడు. మూడో ఎపిసోడ్ : ది వాచర్ ఈజ్ వాచ్డ్(The watcher is watched). ఇందులో డాక్టర్ నయన్, మాధవి ఇద్దరి గురించి డీటేయిలింగ్ ఉంటుంది. నాల్గో ఎపిసోడ్ : ది ఎకోస్ ఆఫ్ డీసీట్(The echoes of Deceit).. ఇది ముప్పై నాలుగు నిమిషాలు ఉంటుంది. ఇందులో డాక్టర్ ని ఇరికించడానికి ఎవరో తనకి ఫోటోలు పంపిస్తారు.. అలాగే పోలీస్ ఇన్వెస్టిగేషన్ లో నయన్ సస్పెక్ట్ అనేలా ప్రొసీడింగ్స్ ఉంటాయి.
అయిదో ఎపిసోడ్: ది డోర్ బిహైండ్ ది ఐ(The Door behind the eye).. ఈ ఎపిసోడ్ ఇరవై తొమ్మిది నిమిషాలు ఉంటుంది. మర్డర్ వెనుక అసలు కారణమేంటో రివీల్ అయ్యే ఎపిసోడ్ ఇది. ఆరో ఎపిసోడ్: ది స్కేర్స్ ఆఫ్ సైలెన్స్ ( The scares of silence) .. ఈ ఎపిసోడ్ ముప్పై ఎనిమిది నిమిషాలు ఉంటుంది. ఇందులో అన్ని ట్విస్ట్ లు రివీల్ అవుతాయి. ఫుల్ ప్యాకేజీ థ్రిల్ అండ్ ఎంగేజింగ్ గా ఈ ఎపిసోడ్ సాగుతుంది. సిరీస్ మొత్తం కలిపి ఒక్క గంటలో కుదించేయొచ్చు కానీ ఎపిసోడ్ లుగా చేసి.. అవసరం లేని సీన్లు చాలా జోడించారు.
అందరి లైఫ్ లో ఏం జరుగుతుందో తెలుసుకోవాలనేది డాక్టర్ క్యూరియాసిటీ.. అయితే అతని వెనుక ఓ సీక్రెట్ బాస్ ఉండటం.. మర్డర్ ని హీరో చూడటం అంతవరకు బాగుంది. కానీ ఈ ఎలిమెంట్స్ ని సరిగ్గా ఎంగేజింగ్ గా చూపించలేకపోయారు.
గ్రిస్పింగ్ స్క్రీన్ ప్లే లేదు. సైన్స్ ఫిక్షన్ ని కాస్త మర్డర్ మిస్టరీగా మార్చేశారు. చివరివరకు ఇన్వెస్టిగేషన్ థ్రిల్లర్ గా మార్చేశారు. అది కూడా ఫుల్ బోరింగ్ అండ్ సప్పగా సాగే ప్రెజెంటేషన్ తో వెళ్తుంటుంది ఒక్కో ఎపిసోడ్. డాక్టర్ చూసినదానిని నిరూపించలేనప్పుడు ఎందుకు ఆ ఇన్వఫర్ మేషన్.. అసలు డాక్టర్ క్యూరియాసిటీ గురించి ఫస్ట్ ఎపిసోడ్ తప్ప.. ఇంకా ఎక్కడా ప్రస్తావించలేదు.. ఇక క్లైమాక్స్ అయితే ఎవరైనా ఊహించేయొచ్చు. బిఎజిఎమ్ ఒకే. సినిమాటోగ్రఫీ పర్వాలేదు. నిర్మాణ విలువలు బాగున్నాయి. స్ట్రోరీ బాగుంది కానీ ప్రెజెంటేషన్ సాదాసీదాగా ఉంది. అశ్లీల దృశ్యాలు లేవు.. అసభ్య పదజాలం వాడలేదు.
నటీనటుల పనితీరు:
నయన్ గా వరుణ్ సందేశ్ ఆకట్టుకునన్నాడు. మాధవిగా ప్రియాంక జైన్ హామ్లీగా కనపడింది. ఉత్తేజ్ ఆకట్టుకున్నాడు. మిగతావారంతా తమ పాత్రలకి న్యాయం చేశారు.
తెలుగువన్ పర్ స్పెక్టివ్ : గుడ్ కాన్సెప్ట్ బట్ వన్ టైమ్ వాచెబుల్.
రేటింగ్: 2.5 /5
✍️. దాసరి మల్లేశ్
![]() |
![]() |