![]() |
![]() |

2009లో మ్యూజిక్ డైరెక్టర్ గా జర్నీ స్టార్ట్ చేసిన తమన్.. తక్కువ టైంలోనే 100 సినిమాలు చేసి సక్సెస్ ఫుల్ మ్యూజిక్ డైరెక్టర్ గా కొనసాగుతున్నాడు. అప్పట్లో కాపీ అంటూ ట్రోల్స్ వచ్చినా.. గత కొంతకాలంగా తమన్ ఆల్బమ్స్ సంచలన విజయాన్ని అందుకుంటున్నాయి. ముఖ్యంగా బ్యాగ్రౌండ్ స్కోర్ విషయంలో తమన్ పై ప్రశంసలు వ్యక్తమవుతున్నాయి. అయితే నేచురల్ స్టార్ నానికి మాత్రం తమన్ బ్యాగ్రౌండ్ స్కోర్ నచ్చలేదట. ఈ విషయాన్ని స్వయంగా తమనే వెల్లడించారు.
నాని, రీతు వర్మ జంటగా శివ నిర్వాణ దర్శకత్వంలో తెరకెక్కిన సినిమా 'టక్ జగదీష్'. ఈ సినిమా సెప్టెంబర్ 10న ప్రేక్షకుల ముందుకు వచ్చింది. ఈ సినిమాకు తమన్ సాంగ్స్ అందించగా.. బ్యాగ్రౌండ్ స్కోర్ మాత్రం గోపీ సుందర్ కంపోజ్ చేశారు. వరుస ప్రాజెక్ట్స్ తో ఫుల్ బిజీగా ఉన్న తమన్.. డైరెక్టర్ శివ నిర్వాణకి అందుబాటులో లేకపోవడం వల్లే.. తమన్ ప్లేస్ లో గోపీ సుందర్ ని తీసుకున్నారని గతంలో వార్తలొచ్చాయి. అయితే తను ఇచ్చిన బ్యాగ్రౌండ్ స్కోర్ నానికి నచ్చకపోవడం వల్లే.. తన ప్లేస్ లో వేరే మ్యూజిక్ డైరెక్టర్ ని తీసుకున్నారని తాజాగా తమన్ సంచలన విషయాన్ని బయటపెట్టాడు.
నేడు (నవంబర్ 16) తమన్ పుట్టినరోజు. ఈ సందర్భంగా తాజాగా ఓ న్యూస్ ఛానల్ కు ఇచ్చిన ఇంటర్వ్యూలో ఆయన మాట్లాడుతూ.. 'టక్ జగదీష్' సినిమాకి తాను చేసిన బ్యాగ్రౌండ్ స్కోర్ నాని గారికి నచ్చలేదని, మళ్ళీ వేరే మ్యూజిక్ డైరెక్టర్ తో చేయించుకున్నారని అన్నారు. ఇలా తన లైఫ్ లో ఫస్ట్ టైం జరిగిందని, దానికి కొంచెం బాధ పడ్డానని తెలిపారు. తాను హార్ట్ ఫుల్ గానే వర్క్ చేసానని.. కానీ ఎక్కడ తప్పు జరిగిందో తెలియదని అన్నారు. అయితే, తనకు నాని గారి పెర్ఫార్మన్స్ బాగా ఇష్టమని, ఆయన నెక్స్ట్ సినిమాకు మ్యూజిక్ అందించే అవకాశం వస్తే తప్పకుండా చేస్తానని తమన్ చెప్పారు.
![]() |
![]() |