![]() |
![]() |

సౌత్ ఇండస్ట్రీలో రాబోయే సెప్టెంబర్ నెల బాక్సాఫీస్ రేసు అత్యంత ఆసక్తికరంగా మారబోతోంది. వైవిధ్యభరితమైన కథాంశాలతో ప్రేక్షకులను అలరించే కోలీవుడ్ స్టార్ కార్తి (Karthi), తన కెరీర్‌లోనే భారీ విజయాన్ని అందుకున్న స్పై యాక్షన్ థ్రిల్లర్ 'సర్దార్' చిత్రానికి సీక్వెల్‌గా 'సర్దార్ 2'(Sardar 2)తో సిద్ధమవుతున్నాడు. ఈ మోస్ట్ అవేటెడ్ మూవీ విడుదల తేదీని మేకర్స్ అధికారికంగా ప్రకటిస్తూ ఒక స్పెషల్ గ్లింప్స్‌ను సోషల్ మీడియా వేదికగా పంచుకున్నారు. ఈ సరికొత్త అప్‌డేట్ ప్రకారం 'సర్దార్ 2' చిత్రం సెప్టెంబర్ 10న గ్రాండ్‌గా విడుదల కానుంది.
అయితే ఈ ప్రకటనతో సౌత్ ఇండియన్ మార్కెట్లలో ఒక భారీ బాక్సాఫీస్ క్లాష్‌కి తెరలేచింది. కార్తి సినిమా విడుదలైన మరుసటి రోజే, అంటే సెప్టెంబర్ 11న రౌడీ హీరో విజయ్ దేవరకొండ (Vijay Deverakonda), నేషనల్ క్రష్ రష్మిక మందన్న జంటగా నటిస్తున్న పీరియడ్ డ్రామా 'రణబాలి' (Ranabaali) ప్రేక్షకుల ముందుకు రాబోతోంది. ఈ రెండు భారీ చిత్రాలు కేవలం ఒక రోజు వ్యవధిలోనే థియేటర్లలోకి వస్తుండటంతో బాక్సాఫీస్ వద్ద విపరీతమైన పోటీ నెలకొనడం ఖాయంగా కనిపిస్తోంది.
కార్తి సోషల్ మీడియాలో షేర్ చేసిన గ్లింప్స్ వీడియోలో బ్యాక్‌గ్రౌండ్‌లో భారీ పేలుడు సంభవిస్తుండగా, చేతిలో గన్ పట్టుకుని ఉన్న ఏజెంట్ సర్దార్ అలియాస్ చంద్రబోస్ లుక్ ప్రేక్షకులను విపరీతంగా ఆకట్టుకుంటోంది. ఈ ఫ్రాంచైజీలో కార్తి ద్విపాత్రాభినయం చేస్తుండగా.. చంద్రబోస్ పాత్రతో పాటు విజయ్ ప్రకాష్ పాత్రలోనూ ఆయనే కనిపించబోతున్నాడు. పి.ఎస్.మిత్రన్ దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రాన్ని ప్రిన్స్ పిక్చర్స్, ఐవీవై ఎంటర్‌టైన్‌మెంట్స్ సంయుక్తంగా నిర్మిస్తున్నాయి. తెలుగు రాష్ట్రాల్లో కార్తికి ఉన్న మంచి ఫాలోయింగ్ కారణంగా ఈ సీక్వెల్‌ను కూడా భారీ స్థాయిలో తెలుగులో రిలీజ్ చేయనున్నారు.
మరోవైపు రాహుల్ సాంకృత్యన్ దర్శకత్వంలో విజయ్ దేవరకొండ, రష్మిక మందన్న, ఆర్నాల్డ్ వోస్లూ ప్రధాన పాత్రల్లో తెరకెక్కుతున్న 'రణబాలి' చిత్రం పాన్ ఇండియా వైడ్ గా సెప్టెంబర్ 11న విడుదల కానుంది.
ఈ రెండు సినిమాలు కూడా ఆగస్టు 26న విడుదల కాబోతున్న రాకింగ్ స్టార్ యశ్, గీతూ మోహన్ దాస్ కాంబినేషన్ మూవీ 'టాక్సిక్' వచ్చిన కొద్ది రోజులకే థియేటర్లలోకి వస్తుండటం గమనార్హం. దీంతో ఆగస్టు ముగింపు నుండి సెప్టెంబర్ మిడ్ వరకు థియేటర్ల వద్ద సినిమాల పండగ వాతావరణం కనిపించనుంది.
కార్తి సరికొత్త స్పై థ్రిల్లర్ ఎంటర్‌టైనర్ 'సర్దార్ 2', విజయ్ దేవరకొండ పీరియడ్ డ్రామా 'రణబలి' చిత్రాలలో బాక్సాఫీస్ విజేతగా ఎవరు నిలుస్తారో చూడాలి.
https://x.com/Prince_Pictures/status/2069629498811900415
![]() |
![]() |