![]() |
![]() |

నటసింహం నందమూరి బాలకృష్ణ (Nandamuri Balakrishna)కు కేంద్ర ప్రభుత్వం పద్మభూషణ్ ను ప్రకటించిన సంగతి తెలిసిందే. ఈ సందర్భంగా సినీ రాజకీయ ప్రముఖులు బాలకృష్ణకు శుభాకాంక్షలు తెలుపుతున్నారు. ప్రముఖ నటి పూనమ్ కౌర్ (Poonam Kaur) కూడా "జై బాలయ్య" అంటూ తన విషెస్ ను తెలియజేశారు. అంతవరకు బాగానే ఉంది కానీ, ఆమె ట్వీట్ కి వచ్చిన ఒక రిప్లై కారణంగా.. మధ్యలో ప్రముఖ దర్శకుడు త్రివిక్రమ్ (Trivikram) టార్గెట్ అయ్యారు.
తన సినీ జీవితాన్ని నాశనం చేశారంటూ దర్శకుడు త్రివిక్రమ్ పై పలుసార్లు విమర్శలు గుప్పించారు పూనమ్. ఇప్పుడు మరోసారి ఆమె త్రివిక్రమ్ పై ఫైర్ అయ్యారు. తాజాగా పూనమ్ "జై బాలయ్య" అని ట్వీట్ చేయగా, ఆ ట్వీట్ కింద ఒక నెటిజెన్ "మీరు బ్రతకడం కోసం ఏం చేస్తారు?" అని కామెంట్ చేశాడు. దానికి పూనమ్ ఊహించని సమాధానమిచ్చారు. "పని చేసేదానిని. కానీ త్రివిక్రమ్ & గ్రూప్ టార్చర్ వల్ల అన్నీ ఆగిపోయాయి." అని పూనమ్ ఆ కామెంట్ కి రిప్లై ఇచ్చారు. ప్రస్తుతం పూనమ్ ఇచ్చిన రిప్లై సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.

![]() |
![]() |