![]() |
![]() |

ఇంటర్నెట్ కనెక్షన్ ఉంటే ఏమి చేయవచ్చు?
స్కూల్ స్టూడెంట్స్ ఆన్ లైన్ క్లాసులు వినొచ్చు.
సాఫ్ట్ వేర్ ఉద్యోగులు వర్క్ ఫ్రమ్ హోమ్ చేయవచ్చు.
ఖాళీగా ఉన్న వాళ్ళు సినిమాలు చూస్తూ ఎంజాయ్ చేయవచ్చు.
పిల్లలు, పెద్దలు, పట్టణ ప్రాంత ప్రజలకు మాత్రమే ఇంటర్నెట్ అక్కరకి వస్తుందా? గ్రామీణ ప్రాంత రైతులకు ఇంటర్నెట్ అవసరం లేదా? మనసుంటే మార్గం ఉంటుంది అన్నట్టు కాస్త ఆలోచిస్తే రైతులకు ఇంటర్నెట్ అక్కరకు వస్తుందని సమంత పరోక్షంగా సమాధానం ఇస్తున్నారు.
ఆన్ లైన్ లో యాక్టింగ్ క్లాసులు మాత్రమే కాదు.... సాగుబడి పాఠాలు సమంత వింటున్నారు. ఇంటర్నెట్ లో క్లాసులు వింటూ వ్యవసాయం ఎలా చేయాలో నేర్చుకుంటున్నారు. తమ టెర్రస్ మీద సమంతా సాగుబడి మొదలుపెట్టారు. మిద్దె వ్యవసాయం చేస్తున్నారామె. అంటే కాంక్రీట్ జంగిల్ లా మారిన సిటీలలో అపార్ట్మెంట్ లో పెద్దపెద్ద కుండీలు ఏర్పాటు చేసుకుని అందులో కాయగూరలు ఆకుకూరలు పండించడం అన్నమాట. ఆల్రెడీ విత్తనాలు నాటిన సమంత, మెరుగైన వ్యవసాయం కోసం ఆన్ లైన్ లో మాస్టర్ క్లాసులు వింటున్నారు.
![]() |
![]() |