![]() |
![]() |

‘నీదీ నాదీ ఒకే కథ’ (2018)తో దర్శకుడిగా తొలి అడుగేశాడు వేణు ఊడుగుల. మొదటి ప్రయత్నంలోనే విమర్శకుల ప్రశంసలు అందుకోవడమే కాకుండా.. విజయాన్ని కూడా సొంతం చేసుకున్నాడు వేణు. కాగా దాదాపు రెండేళ్ళ విరామం అనంతరం ‘విరాటపర్వం’ కోసం మెగా ఫోన్ పట్టాడు ఈ టాలెంటెడ్ డైరెక్టర్. చిత్రీకరణ తుదిదశకు చేరుకున్న ఈ పిరియడ్ డ్రామా.. 10 శాతం మినహా షూటింగ్ పార్ట్ కంప్లీట్ చేసుకుందని టాక్. రానా కథానాయకుడిగా నటిస్తున్న ఈ చిత్రాన్ని సురేశ్ బాబు సమర్పణలో సుధాకర్ చెరుకూరి నిర్మిస్తున్నాడు.
ఇదిలా ఉంటే.. ‘విరాటపర్వం’లో ముగ్గురు టాలెంటెడ్ యాక్ట్రసెస్ అది కూడా అవార్డ్ విన్నింగ్ యాక్ట్రసెస్ ప్రధాన పాత్రల్లో నటిస్తుండడం వార్తల్లో నిలుస్తోంది. ఆ నటీమణులు మరెవరో కాదు.. సాయిపల్లవి, ప్రియమణి, నందితా దాస్. ఈ ముగ్గురి ఖాతాలోనూ 'ఫిల్మ్‌ఫేర్' పురస్కారాలు ఉండడం విశేషం. చిత్ర కథానాయిక సాయిపల్లవి విషయానికొస్తే ‘ప్రేమమ్’(మలయాళం – బెస్ట్ డెబ్యూ), ‘ఫిదా’ (తెలుగు – బెస్ట్ యాక్ట్రస్) చిత్రాలకుగాను 'ఫిల్మ్‌ఫేర్' అందుకుంటే.. ఓ కీలక పాత్రలో నటిస్తున్న ప్రియమణి ‘పరుత్తివీరన్’(తమిళం – బెస్ట్ యాక్ట్రస్), ‘తిరక్కథ’ (మలయాళం – బెస్ట్ యాక్ట్రస్), ‘చారులత’ (కన్నడం – బెస్ట్ యాక్ట్రస్) చిత్రాలకుగాను 'ఫిల్మ్‌ఫేర్' కైవసం చేసుకోవడం విశేషం. అంతేకాదు.. 'నేషనల్ అవార్డ్' (‘పరుత్తివీరన్’) సహా పలు ప్రతిష్ఠాత్మక పురస్కారాలు ప్రియమణి ఖాతాలో ఉండడం విశేషం. ఇక నందితా దాస్ విషయానికొస్తే.. ‘1947 ఎర్త్’ (హిందీ – బెస్ట్ డెబ్యూ)కి గానూ 'ఫిల్మ్‌ఫేర్' అవార్డ్ అందుకుంది. అలాగే ‘నంది’ పురస్కారం (కమ్లి – తెలుగు)తో సహా పలు అవార్డులు నందిత ఖాతాలో ఉన్నాయి.
మొత్తమ్మీద పలు విభాగాల్లో 'ఫిల్మ్‌ఫేర్' అవార్డులను అందుకున్న ఈ ముగ్గురు టాలెంటెడ్ యాక్ట్రసెస్ మేలి కలయికలో వస్తున్న ‘విరాటపర్వం’.. ఇంకెన్ని అవార్డులకు చిరునామాగా నిలుస్తుందో చూడాలి.



![]() |
![]() |