![]() |
![]() |

తెలుగు సినిమా ఇండస్ట్రీ లో టాప్ హీరోయిన్ రేంజ్ కి వెళ్లాలంటే ఎన్నో సంవత్సరాలు కష్టపడితే గాని సాధ్యం కాదు అలాంటిది చాలా తక్కువ వ్యవధిలోనే నెంబర్ వన్ రేంజ్ కి వెళ్లిన నటీమణి సమంత. ఆమె సినిమాలో ఉందంటే చాలు ఇక ఆ సినిమా ఖచ్చితంగా విజయాన్ని అందుకుంటుందనే నానుడి కూడా పరిశ్రమ వర్గాల్లో ఉంది. కానీ ఆమె మయోసైటిస్ అనే ఒక అరుదైన రోగంతో బాధపడుతు కొత్తగా ఎలాంటి సినిమాలకి ఒప్పుకోలేదు.దీంతో సమంత అభిమానులు కొంచం డీలా పడ్డారు. కానీ తాజాగా ఆమెకి సంబంధించిన ఒక న్యూస్ అభిమానుల్లో జోష్ తెచ్చింది.
సమంత హిందీలో సిటాడెల్ అనే వెబ్ సిరీస్ లో ప్రధాన పాత్రలో నటించింది. ఆ సినిమా షూటింగ్ కంప్లీట్ అయ్యాకే సమంత తన హెల్త్ కి సంబంధించిన ట్రీట్ మెంట్ నిమిత్తం యుఎస్ వెళ్ళింది. ఇప్పుడు ఆమె తాజాగా తన పాత్రకి డబ్బింగ్ చెప్పడం మొదలుపెట్టింది. ఇందుకు సంబంధించిన ఫోటోలని సమంత తన సోషల్ మీడియాలో పోస్ట్ చెయ్యడంతో ప్రస్తుతం అవి వైరల్ గా మారాయి. వాటిని చూసిన ఫ్యాన్స్ సమంత ఈజ్ బ్యాక్ అంటు తమ ఆనందాన్ని వ్యక్తం చేస్తున్నారు. ఇక సమంత ఆరోగ్యానికి ఎలాంటి డోకా లేదని మరిన్ని సినిమాల్లో నటించి తన సత్తా చాటుతుందని అంటున్నారు. సమంత పోస్ట్ చేసిన పిక్స్ లో సిటాడెల్ టీం మొత్తం ఉంది
సమంత గత రెండు చిత్రాలు అయిన ఖుషి, శకుంతల చిత్రాల మీద సమంత ఎన్నో ఆశలు పెట్టుకుంది. కానీ ఆ రెండు చిత్రాలు బాక్స్ ఆఫీస్ వద్ద పరాజయం పాలయ్యాయి. లేటెస్ట్ గా సిటాడెల్ తో సమంత తన సత్తా చాటాలని ఉవిళ్లూరుతుంది. ఆమెకి హిందీలో ఇది రెండో వెబ్ సిరీస్.అంతకు ముందు ఫ్యామిలీ మాన్ 2 లో నటించి మంచి పేరుతో పారు అవార్డులని కూడా అందుకుంది. ఫ్యామిలీ మాన్ 2 కి దర్శకత్వం వహించిన రాజ్ డి కె నే సిటాడెల్ కి దర్శకుడు.
![]() |
![]() |