![]() |
![]() |

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ (pawan kalyan) హీరోగా 2011 లో వచ్చిన మూవీ తీన్ మార్..పవన్ కళ్యాణ్ డ్యూయల్ రోల్ లో మెరిసిన ఈ మూవీలో ఒక హీరోయిన్ గా కృతి కర్బందా (Krithi kharbandha) నటించింది. తనని ప్రేమిస్తున్న అబ్బాయి అంటే తనకి ఇష్టం ఉన్నా కూడా ఆ ప్రేమని బయటకి చెప్పలేని అమాయకత్వం తో కూడిన వసుమతి క్యారక్టర్ లో కృతి సూపర్ గా నటించింది. తాజాగా ఆమెకి సంబంధించిన న్యూస్ ఒకటి వైరల్ గా మారింది.
కృతి కి ప్రముఖ నటుడు పుల్కిత్ సామ్రాట్( pulkit samrat)తో ఎంగేజ్ మెంట్ జరిగింది. అత్యంత సన్నిహితుల మధ్య జరిగిన ఈ ఎంగేజ్ మెంట్ తాలూకు పిక్స్ ని కృతి అండ్ పుల్కిత్ లు సోషల్ మీడియాలో షేర్ చెయ్యడంతో ఈ విషయం బయటకి తెలిసింది. ఈ ఇద్దరు బాలీవుడ్ హిట్ మూవీస్ పాగల్ పంత్, వీరే ది వెడ్డింగ్, తైష్ సినిమాల్లో కలిసి నటించారు. కొన్ని సంవత్సరాల నుంచి కృతి పుల్కిత్ లు డేటింగ్ లో ఉన్నారనే వార్తలు వస్తూనే ఉన్నాయి.ఇప్పుడు ఈ ఎంగేజ్ మెంట్ తో వాటికి చెక్ పడింది. పుల్కిత్ కి ఆల్రెడీ ఇంతకుముందే ఒకమ్మాయితో పెళ్లి జరిగింది. ఆ తర్వాత తన నుంచి విడిపోయాడు.

కృతి తీన్ మార్ కంటే ముందే సుమంత్ హీరోగా వచ్చిన బోణి చిత్రంతో తెలుగు సినిమా రంగ ప్రవేశం చేసింది. అందానికి అందం అంతకంటే అందమైన నటన ఉండి కూడా కృతికి తెలుగులో పెద్దగా గుర్తింపు రాలేదు. ఆ తర్వాత హిందీలో పలు సినిమాలు చేసినా కూడా ఆమెకి స్టార్ డమ్ మాత్రం రాలేదు.ప్రస్తుతం కృతి రిస్కీ రోమియో అనే మూవీలో నటిస్తుంది.
![]() |
![]() |