Home  »  News  »  'సకల గుణాభి రామ'.. సన్నీకి సపోర్ట్ గా 'బిగ్ బాస్' ఆల్ కంటెస్టెంట్స్!

Updated : Feb 5, 2022

E.I.P.L పతాకంపై వీజే సన్నీ, శ్రీ తేజ్, ఆషిమా నర్వాల్, తరుణీ సింగ్ నటీనటులుగా వెలిగొండ శ్రీనివాస్ దర్శకత్వంలో సంజీవ రెడ్డి నిర్మిస్తున్న చిత్రం 'సకల గుణాభి రామ'. ఈ సినిమా షూటింగ్ పూర్తి చేసుకుని విడుదలకు సిద్ధమైన  సందర్భంగా చిత్ర యూనిట్  హైదరాబాద్ లోని వెస్టిన్ హోటల్ లో ట్రైలర్ లాంచ్ ఈవెంట్ ఘనంగా నిర్వహించింది. ఈ కార్యక్రమానికి పలు సినీ ప్రముఖులు హాజరై మూవీ టీమ్ కి శుభాకాంక్షలు తెలిపారు. 

ప్రముఖ సంగీత దర్శకుడు ఆర్.పి. పట్నాయక్, దర్శకుడు నాగేశ్వర్ రెడ్డి ఈ చిత్రంలోని పాటలను విడుదల చేయగా.. దర్శకుడు అనిల్ రావిపూడి, యంగ్ హీరో విశ్వక్ సేన్ చిత్ర ట్రైలర్ ను విడుదల చేశారు.ఇంకా ఈ కార్యక్రమంలో కమెడియన్ శివారెడ్డి, బిగ్ బాస్ ఆల్ సీజన్స్ కంటెస్టెంట్స్ పాల్గొని చిత్ర యూనిట్ కు విషెస్ తెలిపారు.

అనిల్ రావిపూడి మాట్లాడుతూ.. "ట్రైలర్ చాలా బాగుంది. సన్నీని సపోర్ట్ చేయడానికి బిగ్ బాస్ కంటెస్టెంట్స్ అందరూ రావడం చాలా సంతోషంగా ఉంది. సన్నీ గురించి స్పెషల్ గా చెప్పాలి.. తను డౌన్ టు ఎర్త్ ఉంటాడు. అందుకే నాకు సన్నీ అంటే  ఇష్టం. నా ఫస్ట్ ఫిల్మ్ పటాస్ డైరెక్ట్ చేసేటప్పుడు నుండి వెలిగొండ తో జర్నీ చేస్తున్నాను. తను 'అంధగాడు' సినిమాను డైరెక్ట్ చేశాడు. ఇప్పుడు తను చేస్తున్న రెండవ సినిమా ఇది. రైటర్ గా బిజీగా ఉన్న తను డైరెక్టర్ గా బిజీ అయి ఎన్నో సినిమాలను తీయాలని  కోరుతున్నాను" అన్నారు.

విశ్వక్ సేన్ మాట్లాడుతూ.. "నేను కూడా నటుడు కావడానికి చాలా ఇబ్బందులు పడ్డాను. 9 సినిమాలకు సెలెక్ట్ అయిన తరువాత కూడా నన్ను రిజెక్ట్ చేసే వారు. తరుణ్ భాస్కర్ అన్న నన్ను గుర్తించి నాకు హీరో అవకాశం ఇచ్చాడు. అలా నేను కూడా స్త్రగుల్ ఫేస్ చేశాను. ఇప్పుడు కూడా నీవు బిగ్ బాస్ కు వెళ్లక ముందే నిన్ను గుర్తించి అవకాశం ఇచ్చారు. ఇప్పుడు మాకంటే ఎక్కువగా ప్రతి ఒక్క తెలుగువారి ఇంట్లో నువ్వు ఉన్నావు .ఈ చిత్ర ట్రైలర్ బాగుంది.ఈ సినిమా పెద్ద హిట్ అవ్వాలని మనస్ఫూర్తిగా కోరుతున్నాను" అన్నారు.

చిత్ర దర్శకుడు వెలుగొండ శ్రీనివాస్ మాట్లాడుతూ.. "అనిల్ రావిపూడి, విశ్వక్ సేన్ ఎంతో బిజీగా ఉన్నా కూడా మా ఫంక్షన్ కు  వచ్చి మమ్మల్ని బ్లెస్స్ చేయడం చాలా సంతోషంగా ఉంది. ఒక వైఫ్ అండ్ హస్బెండ్ లవ్ స్టోరీ తీద్దామనుకుని నిర్మాతలకు ఈ కథ చెప్పడం జరిగింది. టెక్నీషియన్స్, నటీ నటులు అందరూ  సహకరించడంతో సినిమా చాలా బాగా వచ్చింది. E.I.P.L బ్యానర్ లో నిర్మాతలు ఇంకో వంద మందికి అవకాశాలు ఇవ్వాలని మనస్ఫూర్తిగా కోరుతున్నాను. త్వరలో ప్రేక్షకుల ముందుకు వస్తున్న ఈ చిత్రాన్ని అందరూ ఆదరించాలని మనస్పూర్తిగా కోరుతున్నాను" అన్నారు.

హీరో వి.జె సన్నీ మాట్లాడుతూ.. "ఈ కార్యక్రమానికి వచ్చిన పెద్దలకు మరియు బిగ్ బాస్ ఫ్యామిలీ ఫ్రెండ్స్ అందరికీ  ధన్యవాదాలు. ప్రతి మనిషికి లైఫ్ లో ఎక్కువమంది ఉండాల్సింది స్నేహితులే.. వాళ్ళే నన్ను ముందు ఉండి నడిపిస్తారు. మా ఫ్రెండ్స్ కి నేను హీరో అవ్వాలని డ్రీమ్ ఉంది. అందుకే వారి డ్రీమ్ ను నెరవేర్చడానికి యాక్టర్ కావాలని చాలా ట్రై చేశాను. కానీ కుదరలేదు. నేను 10th క్లాస్ లో నటన కోసం హైదరాబాద్ కు రావాలని ట్రైన్ ఎక్కితే అది విజయవాడకు వెళ్ళింది. మిడిల్ క్లాస్ ఫ్యామిలీ నుంచి వచ్చిన నేను థియేటర్ ఆర్ట్స్ కూడా చేశాను.ఆ తర్వాత నేను విజె గా చేశాను. నాకు వరుణ్ సందేశ్  సినిమా లంటే చాలా ఇష్టం తనతో "హ్యాపీ డేస్" లో రాజేష్ క్యారెక్టర్ చేయాలి కానీ అప్పుడు మిస్సయ్యాను. ఆ తర్వాత చాలా సినిమాలు వచ్చి మిస్ అయ్యాయి. హుషారులో  చేయాలి కానీ చేయలేకపోయాను. నాకు " కల్యాణ వైభోగమే" సీరియల్ లో నటించే  అవకాశం వచ్చింది. ఆ తర్వాత వెలిగొండ శ్రీనివాస్ అన్న మాత్రం వీడు యాక్టింగ్ చేయగలడని గుర్తించి ఈ సినిమాలో హీరోగా నటించే ఛాన్స్ ఇచ్చాడు. ఈరోజు నాకు గ్రేట్ మూమెంట్. ప్రస్తుతం ఉన్న పరిస్థితుల్లో ఒక మనిషిని ట్రస్ట్ చేసి ఎంతో డబ్బు పెట్టి సినిమా తీయాలంటే మామూలు విషయం కాదు. వలిగొండ శ్రీనివాస్ అన్న చెప్పిన కథను, నన్ను నమ్మిన నిర్మాతలు  ఒక్క రోజు కూడా ఆలోచించకుండా చేద్దామని ముందుకు వచ్చారు.వారికి నా ధన్యవాదాలు..ఆ తర్వాత బిగ్ బాస్ హౌస్ నుండి పిలుపు రావడం జరిగింది.బిగ్ బాస్ ద్వారా ఎంతో మంది నన్ను అక్కున చేర్చుకొని నా విజయానికి కారకులయ్యారు వారికి నేను ఎప్పటికీ ఋణపడి ఉంటాను. అనిల్ రావిపూడి గారు ,విశ్వక్ సేన్ వారు మమ్మల్ని బ్లెస్స్ చేయడానికి ఈ ఈవెంట్ కు వచ్చినందుకు ధన్యవాదాలు. ఎంతో మంది  పెద్దలు, ఫ్రెండ్స్ రిలేటివ్స్ శ్రేయోభిలాషి లతో ఈ స్టేజి మీద షేర్ చేసుకోవడం చాలా సంతోషంగా ఉంది. ఇక నుండి మంచి మంచి సినిమాలు చేస్తూ మీ అందరికీ పేరు వచ్చేలా ఉంటాను. సినిమా చాలా బాగా వచ్చింది. అందరూ మా సినిమాను ఎంకరేజ్ చేయాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను" అన్నారు.






Disclaimer:
All content included on this TeluguOne.com Portal including text, graphics, images, videos and audio clips, is the property of ObjectOne Information Systems Ltd. or our associates, and protected by copyright laws. The collection, arrangement and assembly of all content on this portal/ related channels is the exclusive property of ObjectOne Information Systems Ltd. or our associates and protected copyright laws.
You may not copy, reproduce, distribute, publish, display, perform, modify, create derivative works, transmit, or in any other way exploit any part of copyrighted material without permission from ObjectOne Information Systems Ltd or our associates.