![]() |
![]() |

అభినయ ప్రదర్శన కంటే అందాల ప్రదర్శనకే పెద్దపీట వేసే కథానాయికల్లో సోనాల్ చౌహాన్ ఒకరు. మూడు పదుల వయసులోనూ మతి పొగోట్టే ఈ సొగస్కాంతం.. తెలుగు, హిందీ, తమిళ, కన్నడ భాషల్లో కలుపుకుని ఇప్పటివరకు 17 సినిమాల్లో సందడి చేసింది. అయితే, తనకు కెరీర్ లో బెస్ట్ హిట్ మూవీ అంటే మాత్రం.. నటసింహ నందమూరి బాలకృష్ణ, మాస్ సినిమాల స్పెషలిస్ట్ బోయపాటి శ్రీను కాంబినేషన్ లో వచ్చిన `లెజెండ్` అనే చెప్పాలి. ఆ బ్లాక్ బస్టర్ మూవీ ముందు వరకు సో సోగా సాగుతున్న సోనాల్ కెరీర్.. తరువాత మాత్రం కాస్త ఊపందుకుంది.
Also Read: సింగిల్ టేక్ లో రెండు పేజీల డైలాగ్ చెప్పిన 'బిగ్ బాస్' కౌశల్!
`లెజెండ్` ఫలితంగానే తెలుగులో `పండగ చేస్కో`, `షేర్`, `సైజ్ జీరో`, `డిక్టేటర్`, `రూలర్`.. ఇలా కొన్ని క్రేజీ ప్రాజెక్ట్స్ లో భాగమైందీ మెరుపు తీగ. అయితే, వీటిలో ఏ సినిమా కూడా `లెజెండ్`లా బాక్సాఫీస్ విన్నర్ అనిపించుకోలేకపోయింది. అంతేకాదు.. `లెజెండ్` తరువాత తన లక్కీ హీరో బాలయ్యతో జట్టుకట్టిన `డిక్టేటర్`, `రూలర్` కూడా తన కెరీర్ కి ఏ మాత్రం ప్లస్ కాలేకపోయాయి. ఈ నేపథ్యంలో.. స్వల్ప విరామం అనంతరం విక్టరీ వెంకటేశ్ నటించిన `ఎఫ్ 3`లో, కింగ్ నాగార్జున నటిస్తున్న `ద ఘోస్ట్`లోనూ అవకాశాలు పట్టింది సోనాల్. మరి.. వెంకీ, నాగ్ కాంబినేషన్స్ లో అయినా ఈ ముద్దుగుమ్మకి కలిసొస్తుందేమో చూడాలి.
కాగా, `ఎఫ్ 3` ఏప్రిల్ 28న విడుదల కానుండగా.. `ద ఘోస్ట్` చిత్రీకరణ దశలో ఉంది.
![]() |
![]() |