![]() |
![]() |

ముంబై లో అంతే.. ముంబై లో అంతే.. ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ (allu arjun)తాతయ్య లెజండరీ యాక్టర్ అల్లు రామలింగయ్య ఫేమస్ డైలాగ్ ఇది. ఇప్పుడు ఈ డైలాగ్ ని అటు ఇటుగా మార్చి సినిమా ఫీల్డ్ లో అంతే..సినిమా ఫీల్డ్ లో అంతే అని చెప్పుకోవాల్సిన పరిస్థితి వచ్చింది. అల్లు అర్జున్ లాంటి బడా స్టార్ సినిమాలో నుంచి ఒక బడా టెక్నీషియన్ తప్పుకున్నాడు.దీంతో ఈ న్యూస్ ఎవరి సపోర్ట్ లేకుండా స్వయంకృషి తో హాట్ టాపిక్ గా మారింది
అల్లు అర్జున్ నయా మూవీ పుష్ప 2(pushpa 2) ఈ మూవీ కోసం అల్లు అర్జున్ ఫ్యాన్స్ తో పాటు ప్రేక్షక లోకం మొత్తం ఎంతో ఆత్రుతతో ఎదురుచూస్తుంది. సుకుమార్ డైరెక్షన్ లో ఎంతో ప్రతిష్టాత్మకంగా పాన్ ఇండియా లెవల్లో తెరకెక్కుతుంది. మరి ఇలాంటి సినిమాకి మెయిన్ టెక్నీషియన్ గా పని చేయడం అంటే గర్వంగానే భావించాలి. కానీ ఎడిటర్ గా పని చేస్తున్న ఆంటోనీ రూబెన్ మూవీ నుంచి తప్పుకున్నాడు. వేరే చిత్రాల కమిట్ మెంట్స్ ఉండటంతోనే తప్పుకుంటున్నానని ఈ విషయంలో ఎలాంటి రూమర్స్ కి తావు లేదని ఆయన తెలిపాడు.
ఆంటోనీ రూబెన్ (Antony Ruben)సాదా సీదా వ్యక్తి కాదు. ఇండియా లో ఉన్న టాప్ మోస్ట్ ఎడిటర్స్ లో ఒకడు. ఆయన ఎడిట్ చేసాడంటే ఇక ఆ మూవీ సూపర్ డూపర్ హిట్ అనే నానుడి సినీ వర్గాల్లో ఉంది. 2011 లో వచ్చిన కందెన్ అనే తమిళ సినిమా ఆయన ఫస్ట్ మూవీ. 2013 లో వచ్చిన ఆర్య, నయనతార ల రాజా రాణి తో దేశ వ్యాప్తంగా ఆయన పేరు మారుమోగిపోయింది. అజిత్ వేదాళం, వివేగం, విశ్వాసం, విజయ్ తేరి, మెర్సిల్, బిగిల్, షారుక్ జవాన్ లాంటి బ్లాక్ బస్టర్స్ ఆయన లిస్ట్ లో ఉన్నాయి. పుష్ప పార్ట్ వన్ కి కూడా ఎడిటర్ గా వ్యవహరించాడు. ఇక ఆయన స్థానంలో నవీన్ నూలి ఎడిటర్ గా ఎంట్రీ ఇచ్చాడు లేటెస్ట్ గా గుంటూరు కారం, టిల్లు స్క్వేర్ వంటి హిట్ మూవీస్ ఆయన నుండి వచ్చాయి. బన్నీ అల వైకుంఠ పురం కూడా ఆయన ఖాతాలో ఉంది
![]() |
![]() |