యంగ్ టైగర్ ఎన్టీఆర్, మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ ప్రధాన పాత్రలలో రాజమౌళి దర్శకత్వంలో రూపొందుతోన్న చిత్రం 'ఆర్ఆర్ఆర్'. బాహుబలి తర్వాత రాజమౌళి దర్శకత్వంలో వస్తున్న సినిమా కావడంతో 'ఆర్ఆర్ఆర్'పై భారీ అంచనాలు ఉన్నాయి. ఇప్పటికే విడుదలైన టీజర్స్, పోస్టర్స్ ఆకట్టుకున్నాయి. ఇక స్నేహితుల దినోత్సవం సందర్భంగా ఆగష్టు 1 న 'దోస్తీ' అనే సాంగ్ ను విడుదల చేయగా.. సూపర్బ్ రెస్పాన్స్ తెచ్చుకోవడంతో పాటు యూట్యూబ్ లో కొత్త రికార్డులను క్రియేట్ చేస్తోంది. అయితే ఈ సాంగ్ ఐడియా రాజమౌళిది కాదట.
ఆర్ఆర్ఆర్ దోస్తీ సాంగ్ ఐడియా ఎస్.ఎస్.కార్తికేయదేనని రాజమౌళి సోమవారం ట్విట్టర్ వేదికగా వెల్లడించారు. "దోస్తీ వీడియో సాంగ్ ఐడియా కార్తికేయది. నేను ‘ఆర్ఆర్ఆర్’ క్లైమాక్స్ సాంగ్ చిత్రీకరణలో ఉన్నప్పుడు.. కొరియోగ్రాఫర్ సతీష్, దినేష్కృష్ణన్తో కలిసి కార్తికేయ ఈ వీడియో రూపొందించారు. పాటకు ఇంత రెస్పాన్స్ వస్తుందని ఊహించలేదు" అని రాజమౌళి పేర్కొన్నారు.
ఆర్ఆర్ఆర్ లో అల్లూరి సీతారామరాజుగా చరణ్, కొమరం భీమ్ గా తారక్ కనిపించనున్నారు. ఇందులో చరణ్ సరసన బాలీవుడ్ భామ ఆలియా భట్, తారక్ సరసన హాలీవుడ్ బ్యూటీ ఒలివియా మోరిస్ నటిస్తున్నారు. అజయ్ దేవగన్, శ్రియ తదితరులు కీలక పాత్రల్లో నటిస్తున్న ఈ సినిమాను అక్టోబర్ 13 న విడుదల చేయడానికి ప్లాన్ చేస్తున్నారు.