Home  »  News  »  అన్నయ్య ఈ సారైనా హిట్ అందుకుంటాడా.. ఆ మూవీపై భారీ అంచనాలు

Updated : Aug 3, 2026

 

 


మాస్ మహారాజ రవితేజ(Ravi Teja).. ఎవరి అండదండలు లేకుండా స్వయంకృషితో పైకొచ్చిన ఆరడగుల కట్ అవుట్.  ఎనర్జిటిక్ పెర్ ఫార్మెన్స్ కి బ్రాండ్ అంబాసిడర్.  డైలాగ్స్, యాటిట్యూడ్ కి చాలా మంది ఫ్యాన్స్ ఉన్నారు. సరైన హిట్ అనేది కొంత కాలంగా దోబూచులాడుతూ ఉంది. 

అయితే ఈసారి 'ఇరుముడి'(Irumudi)తో హిట్ పక్కా అనే మాటలు ఫ్యాన్స్ తో పాటు ట్రేడ్ సర్కిల్స్  నుంచి వినిపిస్తున్నాయి. ఈ నెల 21 న రిలీజ్ అవుతున్న ఇరుముడి నుంచి ఇప్పటి వరకు వచ్చిన ప్రచార చిత్రాలు రవితేజ పవర్‌ఫుల్ లుక్ మంచి హైప్‌ క్రియేట్ చేశాయి. అయితే, ప్రతి సినిమా విజయానికి ముఖ్యంగా మాస్ సినిమాలకు పాటలు ఎంతటి కీలకమైన పాత్ర పోషిస్తాయో మనందరికీ తెలిసిందే. 'ఇరుముడి' విషయంలోనూ సరిగ్గా అదే జరుగుతోంది. ఇటీవల విడుదలైన ఈ చిత్రంలోని సాంగ్స్ సినిమాపై పాజిటివ్ వైబ్రేషన్స్‌ను రెట్టింపు చేశాయి.

చార్ట్‌బస్టర్‌గా నిలిచిన ఈ పాటలకు శ్రోతల నుంచి, ముఖ్యంగా సంగీత ప్రియుల నుంచి అద్భుతమైన స్పందన లభిస్తుంది. యూట్యూబ్‌లో విడుదలైన కేవలం 24 గంటల్లోనే 10 మిలియన్లకు పైగా రియల్ టైమ్ వ్యూస్ సాధించి, ట్రెండింగ్ నంబర్ 1 స్థానంలో నిలవడం ఈ పాటల సత్తా  నిరూపిస్తోంది. ముఖ్యంగా మాస్ అండ్ ఫోక్ బీట్‌తో సాగే మొదటి సాంగ్ మిలియన్ల కొద్దీ రీల్స్, షార్ట్స్ రూపంలో ఇన్స్టాగ్రామ్‌లో వైరల్ అయింది. దాదాపు 500k కి పైగా యూజర్లు ఈ ఆడియో ట్రాక్‌ను ఉపయోగిస్తూ రీల్స్ చేయడం విశేషం. ఇక ఈ చిత్రంలోని సెకండ్ సింగిల్, ఒక ఎమోషనల్ అండ్ మెలోడీ డివోషనల్ టచ్‌తో వచ్చి ప్రేక్షకులను మంత్రముగ్ధులను చేసింది. జివి ప్రకాష్ కుమార్  అందించిన ఈ అద్భుతమైన సంగీతం, రవితేజ మార్క్ ఎనర్జిటిక్ మాస్ సీన్స్‌కి చక్కగా కుదిరాయనేది టాక్   పాటల్లోని లిరిక్స్, ఇన్స్ట్రుమెంటేషన్ ప్రొడక్షన్ విలువలని  బాగా పెంచేశాయి.

సినిమా సక్సెస్‌లో 60% వరకు మ్యూజిక్ కాంట్రిబ్యూషన్ ఉంటుందని బాక్సాఫీస్ విశ్లేషకులు చెబుతుంటారు. గతంలో రవితేజ కెరీర్‌లో అతిపెద్ద హిట్లుగా నిలిచిన సినిమాలను ఒకసారి పరిశీలిస్తే, వాటన్నింటికీ మ్యూజిక్ ప్రధాన బలంగా నిలిచింది. ఉదాహరణకు ఆయన కెరీర్‌లో 100 కోట్లకు పైగా గ్రాస్ రాబట్టిన 'ధమాకా' కానీ, 'క్రాక్' కానీ పాటల పరంగా విశేష ఆదరణ పొందినవే. ఇప్పుడు 'ఇరుముడి' చిత్రానికి కూడా అదే తరహా మ్యూజికల్ బజ్ లభించడం విశేషం. ఈ పాటలు సృష్టించిన పాజిటివ్ వైబ్స్ సినిమా బిజినెస్‌పై కూడా భారీగా ప్రభావం చూపుతున్నాయి. ఇప్పటికే థియేట్రికల్ హక్కులు తెలుగు రాష్ట్రాల్లోనే దాదాపు 45 కోట్లకు పైగా అమ్ముడైనట్లు ట్రేడ్ వర్గాల సమాచారం. నాన్ థియేట్రికల్ హక్కుల రూపంలో డిజిటల్, శాటిలైట్, ఆడియో కలిపి మరో 35 కోట్ల వరకు బిజినెస్ చేసినట్లు తెలుస్తోంది.


Also read: నేను ముస్లీమ్ ని కాదని చెప్పడానికి మీరెవరు? #రాఖీ సావంత్ సంచలన వ్యాఖ్యలు 


కేవలం సాంగ్స్ మాత్రమే కాకుండా, విజువల్‌గా కూడా ఈ పాటల ప్రొడక్షన్ వాల్యూస్ 100% బెస్ట్‌గా ఉన్నాయి. రవితేజ సిగ్నేచర్ డ్యాన్స్ స్టెప్స్, విజువల్స్ చూస్తుంటే థియేటర్లలో రెస్పాన్స్ నెక్స్ట్ లెవల్‌లో ఉండబోతోందని స్పష్టమవుతోంది. ఆడియన్స్ థియేటర్లకు రావడానికి పాటలు అతిపెద్ద కాటలిస్ట్‌గా పనిచేస్తాయి. ఇప్పటికే ప్రీ-రిలీజ్ హైప్ 80% పైగా పూర్తి కావడానికి ఈ మ్యూజిక్ ప్రమోషన్సే కారణమని సినీ విశ్లేషకులు భావిస్తున్నారు. పాటలతోనే ఇంతటి పాజిటివిటీ సాధించిన 'ఇరుముడి', కథ మరియు కథనం కూడా అదే స్థాయిలో ఉంటే రవితేజ ఖాతాలో మరో 100 కోట్ల క్లబ్ హిట్ చేరడం ఖాయమని ట్రేడ్ విశ్లేషకులు గట్టిగా అంచనా వేస్తున్నారు. లేటెస్ట్ గా ఈ రోజు రిలీజైన 'యాలాలో యాలాలో' సాంగ్ కూడా రికార్డు సృష్టించే పనిలో బిజీగా ఉంది. 

Irumudi, Raviteja, Priya Bhavani Shankar, Siva Nirvana

 

 


 






Disclaimer:
All content included on this TeluguOne.com Portal including text, graphics, images, videos and audio clips, is the property of ObjectOne Information Systems Ltd. or our associates, and protected by copyright laws. The collection, arrangement and assembly of all content on this portal/ related channels is the exclusive property of ObjectOne Information Systems Ltd. or our associates and protected copyright laws.
You may not copy, reproduce, distribute, publish, display, perform, modify, create derivative works, transmit, or in any other way exploit any part of copyrighted material without permission from ObjectOne Information Systems Ltd or our associates.