Home  »  News  »  నేను ముస్లీమ్ ని కాదని చెప్పడానికి మీరెవరు? రాఖీ సావంత్ సంచలన వ్యాఖ్యలు 

Updated : Aug 3, 2026

 

రాఖీ సావంత్(Rakhi Sawant)..నటిగా, సింగర్ గా కంటే ఫైర్ బ్రాండ్ హోదాలో సంచలన సంఘటనలకి, స్పీచ్ కి బ్రాండ్ అంబాసిడర్. ఇప్పుడు మరోసారి సామాజిక మాధ్యమాల్లో సంచలన వ్యాఖ్యలతో వార్తల్లో నిలిచారు. మత విశ్వాసాల పేరుతో తనని  నిరంతరం విమర్శిస్తున్న ట్రోలర్లపై ఆమె తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తూ గట్టి కౌంటర్ ఇచ్చారు. తాను ఇస్లాం మతాన్ని స్వీకరించిన తర్వాత కూడా కొందరు తన విశ్వాసాన్ని శంకిస్తూ, తనని  ముస్లింగా అంగీకరించబోమని విమర్శలు చేయడంపై రాఖీ తీవ్రంగా స్పందించారు. తన ఆధ్యాత్మిక ప్రయాణం, దైవ విశ్వాసం కేవలం తన మానసిక ప్రశాంతత కోసం మాత్రమేనని, ఇతరులకు నిరూపించుకోవాల్సిన అవసరం తనకు లేదని స్పష్టం చేశారు. 

రాఖీ సావంత్ మూలాలు పరిశీలిస్తే ఆమె ఒక సంప్రదాయ మరాఠీ హిందూ కుటుంబంలో జన్మించారు.  2022వ సంవత్సరంలో  వ్యాపారవేత్త ఆదిల్ ఖాన్ దురానీని వివాహం చేసుకున్న సందర్భంలో ఇస్లాం మతాన్ని స్వీకరించారు. మతం మారిన అనంతరం ఆమె తన పేరును ఫాతిమాగా మార్చుకుంది. ఆ తర్వాత కాలంలో ఇద్దరు విడిపోయారు. అయినా సరే  ఇస్లాం పట్ల భక్తి మాత్రం తగ్గలేదని చెప్పుకుంటూ వస్తుంది.   


Also read: Deepika padukone: దీపికా పదుకునే ఎమోషనల్ పోస్ట్.. ఫ్యాన్స్ కన్నీరు


ఇటీవల బీబీసీ న్యూస్ హిందీకి ఇచ్చిన ఒక ప్రత్యేక ఇంటర్వ్యూలో రాఖీ సావంత్ తన ఆధ్యాత్మిక జీవితానికి సంబంధించిన ఆసక్తికర వివరాలను పంచుకున్నారు. ఇస్లాం మతం స్వీకరించినప్పటి నుండి ఇప్పటివరకు తాను ఏకంగా 8 సార్లు పవిత్ర మక్కా, మదీనా నగరాలను సందర్శించి ఉమ్రాను విజయవంతంగా పూర్తి చేసినట్లు వెల్లడించారు. ఒకసారి కాకుండా ఏకంగా 8 సార్లు ఉమ్రా చేయడం  దైవభక్తికి నిదర్శనం. నేను ముస్లింనో కాదో నిర్ణయించడానికి మీరెవరు? నన్ను ఈ లోకంలోకి తీసుకువచ్చిన తల్లిదండ్రులు మీరు కారు, నా జీవిత ఖర్చులను భరించేది మీరు కారు" అంటూ ఘాటైన వ్యాఖ్యలతో విమర్శకుల నోళ్లు మూయించారు.  

 






Disclaimer:
All content included on this TeluguOne.com Portal including text, graphics, images, videos and audio clips, is the property of ObjectOne Information Systems Ltd. or our associates, and protected by copyright laws. The collection, arrangement and assembly of all content on this portal/ related channels is the exclusive property of ObjectOne Information Systems Ltd. or our associates and protected copyright laws.
You may not copy, reproduce, distribute, publish, display, perform, modify, create derivative works, transmit, or in any other way exploit any part of copyrighted material without permission from ObjectOne Information Systems Ltd or our associates.